
టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ నితిన్ పెళ్లి వార్తలకు ఫుల్ స్టాప్ పడింది ఎట్టకేలకు నితిన్ ఓ ఇంటి వాడు కాబోతున్నాడు. ఇవాళ హైదరాబాద్ లోని తన నివాసంలో కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ సమక్షంలో శాలినీతో నితిన్ ఎంగేజ్ మెంట్ అయ్యింది. పెళ్లి పనులు ప్రారంభమయ్యాయని..మ్యూజిక్ స్టార్ట్.. తమను ఆశీర్వదించండంటూ ఫోటోలను ట్విట్టర్లో షేర్ చేశాడు నితిన్. కొన్ని రోజులుగా శాలీని అనే అమ్మాయితో నితిన్ లవ్ లో ఉన్నాడు. వీరిద్దరి ప్రేమకు పెద్దలు ఒకే చెప్పడంతో పెళ్లి ఫిక్స్ అయ్యింది. ఏప్రిల్ 16న వీరి పెళ్లి జరగనుంది.ప్రస్తుతం నితిన్ వెంకీ కుడుముల డైరెక్షన్ లో భీష్మ సినిమాలో నటిస్తున్నాడు. ఈ మూవీ ఈ నెల 21న రిలీజ్ కానుంది.