హీరో నితిన్ పెళ్లి వాయిదా?

హీరో నితిన్ పెళ్లి వాయిదా?

ఇటీవల విడుదలయిన భీష్మా చిత్ర విజయంతో హీరో నితిన్ మంచి ఊపుమీదున్నాడు. ఆ సంతోష వేడుకలు ముగియకముందే తన స్నేహితురాలు షాలినిని పెళ్లి చేసుకోవాలని డిసైడయి నిశ్చితార్థం కూడా చేసుకున్నాడు. ఏప్రిల్ 15న అంగరంగ వైభవంగా పెళ్లి చేసుకోవాలని దుబాయ్‌లోని వెర్సేస్ పాలాజ్జో లగ్జరీ హోటల్‌ను కూడా బుక్ చేసుకున్నాడు. వధూవరులు పెళ్లి కోసం కావలసిన షాపింగ్ కూడా మొదలుపెట్టారు. అంతా సవ్యంగా జరుగుతున్న ఈ సమయంలో అనుకోకుండా నితిన్, షాలినిల పెళ్లి వాయిదా పడినట్లు వార్తలు వస్తున్నాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ అన్నిదేశాలలో విస్తరిస్తుడటం.. ఆయా దేశాలు విదేశీయుల్ని తమ దేశానికి రాకుండా నిషేధం విధించడంతో నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకోవాలని భావిస్తున్నారని సమాచారం.

ఇప్పటికైతే నితిన్ పెళ్లి వాయిదా పడిందా లేదా అనేది స్పష్టంగా తెలియదు. కానీ.. దుబాయ్‌లో కూడా వైరస్ వ్యాప్తి చెందుతుండటంతో పెళ్లిని హైదరాబాద్‌లో నిర్వహించడానికి ఆయన కుటుంబసభ్యులు ప్రయత్నిస్తున్నారని సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. ప్రస్తుతానికి.. నితిన్ మరియు షాలిని కుటుంబ సభ్యులు పెళ్లి వాయిదా గురించి కానీ.. పెళ్లి ఎక్కడ అనేదాని గురించి ఎటువంటి ప్రకటన చేయలేదు. ముందు అనుకున్నట్లు దుబాయ్‌లో జరపాలనుకున్న పెళ్లికి తమ ఇరుకుటుంబాల నుంచి కేవలం 50 నుంచి 60 మందిని పిలవాలని నిర్ణయించుకున్నారు. కరోనా వైరస్ వల్లే నితిన్ పెళ్లి వాయిదా పడినట్లు సమాచారం. త్వరలోనే వారి వివాహానికి సంబంధించి పెళ్లి తేదీని మరియు పెళ్లి ఎక్కడ అనేది కూడా తెలియజేస్తారని సమాచారం. ప్రీ-వెడ్డింగ్ మరియు పెళ్లి ఏప్రిల్ 15న దుబాయ్‌లో జరగాల్సి ఉంది. ఆ తర్వాత ఏప్రిల్ 16న రిసెప్షన్‌కు ఏర్పాట్లు చేసుకున్నారు. అంతేకాకుండా.. సినీ నటులు మరియు ప్రముఖ వ్యక్తుల కోసం ఏప్రిల్ 21న హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ నిర్వహించాలని నితిన్ తండ్రి ప్లాన్ చేసినట్లు సమాచారం. కరోనా దెబ్బకు ఇవన్నీ ఆగిపోయేటట్లు కనిపిస్తోంది.

నితిన్ 2012లో ఒక కామన్ ఫ్రెండ్ ద్వారా షాలినిని కలుసుకున్నాడు. ఆ తర్వాత వారి స్నేహం ప్రేమకు దారితీసింది. సెలబ్రిటీలు వారి జీవితాన్ని ప్రైవేటుగా ఉంచడం చాలా కష్టం. కానీ.. మేము మా బంధాన్ని రహస్యంగా ఉంచగలిగామని నితిన్ తమ నిశ్చితార్థానికి ముందు మీడియాతో పంచుకున్నారు.

For More News..

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు కరోనా టెస్ట్

బ్యాడ్‌న్యూస్: అప్పుడే పుట్టిన బిడ్డకు కరోనా

ఫోన్ కొనాలంటే వెంటనే కొనేయండి.. ఏప్రిల్ నుంచి ఫోన్ల ధర పెంపు