నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్‌ అరుదైన ఘనత

నటుడు మాధవన్‌ తనయుడు వేదాంత్‌ అరుదైన ఘనత

మాధవన్ కుమారుడు వేదాంత్‌ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నాడు. 16 ఏళ్ల వేదాంత్ 7 జాతీయ అవార్డులను గెలిచి అరుదైన ఘనత సాధించాడు. ఇటీవల ముగిసిన 47వ జూనియర్ నేషనల్ ఆక్వాటిక్ ఛాంపియన్‌షిప్స్ 2021లో మొత్తం ఏడు పతకాలను గెలుచుకున్నాడు. అతి చిన్న వయసులోనే వేదాంత్‌ సాధించిన ఘనతను ప్రశంసిస్తూ రాజ్యసభ సభ్యుడు అభిషేక్‌ మను సింఘ్వీ ఓ ట్వీట్‌ చేశారు.

బెంగళూరు వేదికగా బసవనగుడి ఆక్వాటిక్ సెంటర్‌లో జరిగిన ఈ పోటీలో వేదాంత్‌ నాలుగు రజత పతకాలతో పాటు మూడు కాంస్య పతకాలు సాధించాడు. ఈ పోటీలో వేదాంత్‌ మహారాష్ట్రకు ప్రాతినిధ్యం వహించాడు. ఇందులో 800 మీటర్ల ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 1500 ఫ్రీస్టైల్ స్విమ్మింగ్, 4×100 ఫ్రీస్టైల్ రిలే,  4×200 ఫ్రీస్టైల్ రిలే ఈవెంట్లలో రజత పతకాలు గెలుచుకున్నాడు.