
జీహెచ్ఎంసీలో పోలింగ్ నెమ్మదిగా సాగుతోంది. గ్రేటర్ ఓటర్లు ఇళ్లు దాటి బయటకు రావడం లేదు. మధ్యాహ్నం 1 గంటల వరకు పోలింగ్ 20 శాతం దాటకపోవడం గమనార్హం. ఓటు వేసిన సినీ నటుడు రాజేంద్ర ప్రసాద్ పోలింగ్ పట్ల నిరాశచెందానన్నారు . ప్రతి ఒక్కరు ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. ఓటు హక్కును వినియోగించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. తాను అరకు నుంచి వచ్చి ఓటేశానని హైదరాబాద్ లో ఉన్న వాళ్లు కూడా ఓటు వేయడానికి రావట్లేదన్నారు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు కోల్పోతామని..ఖచ్చితంగా ఓటు వేయాలన్నారు.