
ప్రముఖ యూట్యూబ్ నటుడు రవి శివతేజ(Ravi shivateja) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇప్పటికే 400 షార్ట్ ఫిలిమ్స్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రీసెంట్ గా షణ్ముఖ్(Shanmukh) ప్రధాన పాత్రలో వచ్చిన సూర్య(Surya) వెబ్ సిరీస్ లో రవి శివతేజ నటనకు చాలామంచి పేరు వచ్చింది. ఆ గుర్తింపుతోనే సినిమాల్లో కూడా మంచి మంచి అవకాశాలు దక్కించుకుంటున్నాడు రవి శివతేజ.
ఇక తాజాగా రవి శివతేజ నటించిన మూవీ ఉస్తాద్(Ustaad). యంగ్ హీరో శ్రీసింహ(Srisimha) హీరోగా వచ్చిన ఈ సినిమా ఇటీవలే విడుదలైంది కానీ ఆడియన్స్ నుండి ఆశించిన రెస్పాన్స్ రాలేదు. ఓపక్క జైలర్, మరోపక్క భోళా శంకర్ సినిమాలతో పోటీగా వచ్చిన ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు పోయిందో కూడా ఎవరికీ తెలియలేదు.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు నటుడు రవి శివతేజ ఉస్తాద్ గురించి, బిగ్ బాస్ ఎంట్రీ గురించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశారు. ఉస్తాద్ చాలా మంచి సినిమా. కానీ జైలర్, భోళా శంకర్ వంటి సినిమాలు ఉండటం వల్ల మా సినిమా ఎక్కువ మందికి రీచ్ అవలేదు. ఇక బిగ్ బాస్ ఎంట్రీ గురించి మాట్లాడుతూ.. నేను బిగ్‌బాస్‌లోకి వెళ్తే నా భార్య నాకు విడాకులు ఇచ్చేస్తానని వార్నింగ్ ఇచ్చింది. నాకు కూడా ఆ షోకు వెళ్లాలనే ఆలోచనలేదని చెప్పుకొచ్చారు రవి శివతేజ.
రవి శివతేజ భార్య శ్యామల మరెవరో కాదు ప్రముఖ దర్శకుడు కే విజయభాస్కర్ కూతురు. నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావ్, మన్మధుడు, జై చిరంజీవి వంటి సూపర్ హిట్ సినిమాలతో టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు కే విజయభాస్కర్.