తిరుమల శ్రీవారి దర్శించుకున్న సూర్య కుటుంబం.. అభిమానిపై సీరియస్ !

తిరుమల శ్రీవారి దర్శించుకున్న సూర్య కుటుంబం..  అభిమానిపై సీరియస్ !

తిరుమల  శ్రీవేంకటేశ్వరస్వామిని నటుడు సూర్య, జ్యోతిక దంపతులు దర్శించుకున్నారు.  వీఐపీ విరామం సమయంలో తమ పిల్లలు దియా, దేవల్ లతో కలిసి శ్రీవారి సేవలో పాల్గొన్నారు. అంతకుముందు వీరికి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు.   సోమవారం ఉదయం ఆలయానికి చేరుకున్న సూర్య కుటుంబం క్యూలో నిలబడి స్వామివారిని దర్శించుకున్నారు.  అయితే, ఈ దర్శనం తర్వాత జరిగిన సంఘటన చర్చనీయాంశంగా మారింది.

దర్శనం ముగించుకుని బయటకు వస్తున్న సూర్య, జ్యోతిక దంపతులు, వారి పిల్లలు రాంబగీచ వద్ద అభిమానులను పలకరించారు. ఈ సమయంలో ఒక అభిమాని సూర్యకు షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు ముందుకు వచ్చాడు. అయితే, అదే సమయంలో భార్య జ్యోతిక, తన కుమార్తె అటుగా వస్తుండగా, సూర్య ఆ అభిమాని చేతిని సీరియస్ గా పట్టుకుని పక్కకు లాగారు. ఈ సంఘటన అభిమానులను ఆశ్చర్యపరిచింది. సూర్య దురుసుగా ప్రవర్తించారని కొందరు అభిమానులు అభిప్రాయపడ్డారు. ఈ సంఘటన తరువాత, సూర్య కుటుంబం ఫొటోలకు ఫోజులిచ్చి, అభిమానులను సంతోషపరిచారు.

దర్శనం అనంతరం తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సూర్య కుటుంబానికి  తీర్థ ప్రసాదాలు అందజేశారు. సూర్య కుటుంబం తిరుమలకు వచ్చిన విషయం తెలిసి పెద్ద సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు.  దర్శనం ముగిసిన తర్వాత సూర్య తన కుటుంబంతో కలిసి ఆలయం వెలుపల అభిమానులను పలకరించారు. ఫొటోలకు ఫోజులిచ్చి వారిని సంతోషపరిచారు.  శ్రీవారిని దర్శించుకోవడం ఎంతో సంతోషంగా ఉందని, స్వామివారిని దర్శించుకుంటే మనస్సు ప్రశాంతంగా ఉంటుందని సూర్య చెప్పారు. ఈ రోజు కుటుంబంతో కలిసి తిరుమల రావడం గొప్ప అనుభూతి అని తెలిపారు