
మహేశ్తో ‘వన్నేనొక్కడినే’ చేసిన కృతి సనన్ ఆ తర్వాత బాలీవుడ్లో బిజీగా మారింది. ఇన్నాళ్లకు ప్రభాస్ ‘ఆదిపురుష్’ సినిమాలో సీతగా మారి తెలుగు ప్రేక్షకులను అలరించనుంది. అయితే, ఈ సినిమాలో నటించడం తనకంత ఈజీ కాలేదని చెప్పుకొచ్చింది. సీత పాత్రకు పూర్తి న్యాయం చేసేందుకు ఆమె తెలుగు పాఠాలు కూడా నేర్చుకుందట.
హిందీతో పాటుగా తెలుగులోనూ విడుదలవుతుండటంతో డైలాగుల పరంగా జాగ్రత్త వహించానని చెప్పింది. అందుకోసం ప్రత్యేకంగా ఓ ట్యూటర్ను నియమించుకున్నట్టు మూవీ ప్రమోషన్లో తెలిపింది. దీనిని ఒక సినిమాలా కాకుండా జీవితంలా భావిస్తానని పేర్కొంది. జానకి లాంటి అరుదైన పాత్ర తనకు లభించడంపై సంతోషం వ్యక్తం చేసింది. సీత లుక్లో కృతికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇక ఈ రోల్లో ఈ బ్యూటీ ఏ మేరకు మెప్పిస్తుందోనని అంతా ఎదురుచూస్తున్నారు. జూన్ 16న ఆదిపురుష్ థియేటర్లలోకి రానున్న విషయం తెలిసిందే.