ఖమ్మంలో హీరోయిన్ రీతూ వర్మ సందడి .. పద్మం సిల్వర్ జ్యుయలరీ షాపు ప్రారంభం

ఖమ్మంలో హీరోయిన్ రీతూ వర్మ సందడి .. పద్మం సిల్వర్ జ్యుయలరీ షాపు  ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు :  ఖమ్మంలో హీరోయిన్​ రీతూ వర్మ సందడి చేశారు. గురువారం ఖమ్మం సిటీలోని వైరా రోడ్డులో నూతనంగా ఏర్పాటు చేసిన పద్మం సిల్వర్ జ్యుయలరీ షాపును ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పద్మం సిల్వర్ జ్యుయలరీ మరో శాఖను ఖమ్మంలో ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. 

షాపు నిర్వాహకులు మాట్లాడుతూ రూ.లక్ష కొనుగోలుపై రూ.50 వేల సిల్వర్ నగలు, రూ.50 వేల కొనుగోలుపై రూ. 25 వేల సిల్వర్ నగలు ఉచితంగా కస్టమర్లకు ఇవ్వనున్నామని, ఈ ఆఫర్ ఈ నెల 15వరకు ఉంటుందని తెలిపారు. కాగా, రీతూవర్మను చూసేందుకు అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.