
హీరోయిన్ తమన్నా రెండు వెబ్‌సిరీస్‌లో నటించింది. తాజాగా తమన్నా, నటుడు విజయ్‌వర్మ కలిసి హిందీ లస్ట్ స్టోరీజ్2 వెబ్ సిరీస్లో నటిస్తున్నారు. సిరీస్కోసం బోల్డ్పెర్ఫామెన్స్చేయడానికి ఒకే చెప్పిందని తెలుస్తోంది. తమన్నా ఇప్పటి వరకు బోల్డ్సీన్స్లో యాక్ట్ చేయలేదు. తొలిసారి లస్ట్ స్టోరీస్2 కోసం చేసిందని టాక్. వెబ్ సిరీస్టీజర్వచ్చే వరకు ఫ్యాన్స్ ఎదురుచూడాల్సిందే.
ఇదిలావుండగా..ఇటీవల తమన్నా, నటుడు విజయ్‌వర్మ డేట్లో ఉందనే ప్రచారం నడుస్తోంది. రెగ్యులర్‌గా బాలీవుడ్పార్టీలకు ఇద్దరూ కలిసి వెళ్తున్నారు. వీరి రిలేషన్‌పై ఎవరూ ఓపెన్‌గా స్పందించలేదు. వాలెంటైన్స్ డే రోజున విజమ్ వర్మ ఓ పోస్ట్ చేసి లవ్ఎక్స్ప్రెస్చేశాడని తెలిసిందే. దీనిపై సినీ పరిశ్రమలో ఆసక్తికర చర్చ జరుగుతోంది.