Cricket World Cup 2023: సెకనుకు రూ.3 లక్షలు.. వరల్డ్ కప్ యాడ్ ఛార్జ్

Cricket World Cup 2023: సెకనుకు రూ.3 లక్షలు.. వరల్డ్ కప్ యాడ్ ఛార్జ్

ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్ లో భాగంగా ఇంగ్లాండ్- న్యూజిలాండ్ జట్ల మధ్య జరిగిన తొలి మ్యాచులో స్టేడియం అంతా ఖాళీగా కనిపించిన సంగతి తెలిసిందే. అహ్మదాబాద్ లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచులో ప్రేక్షకులు లేకపోవడం నిరాశకు గురి చేసింది. అయితే యాడ్స్ విషయంలో మాత్రం అలాంటి ఛాయలు కనిపించడం లేదు. 
         
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరిగే వరల్డ్ కప్ లో మొత్తం 10 జట్లు 48 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. ఈ మెగా  టోర్నమెంట్ ప్రకటనల ద్వారా రూ. 2,500-3,000 కోట్లు రాబట్టవచ్చని మీడియా ప్లానర్ల అంచనా.  2019 వన్డే వరల్డ్ కప్ (1,350కోట్లు) తో పోలిస్తే 2023 వరల్డ్ కప్ ఎడిషన్‌కు ఇది రెట్టింపు. టోర్నమెంట్ భారత్ లో నిర్వహించనుడడం, మరోవైపు ఫెస్టివల్ సీజన్ కావడం భారత్ కి కలిసి వచ్చింది. 

కాగా.. ఇండియా పాకిస్థాన్ మ్యాచ్ కోసం టీవీలో స్పాట్ ధరలు 10 సెకన్లకు 30 లక్షలకు అమ్ముడవుతున్నాయి. డెలాయిట్ భాగస్వామి జెహిల్ థక్కర్ మాట్లాడుతూ.. 10 సెకనుల స్పాట్‌కు  15-30 లక్షల మధ్య ఖర్చవుతుంది. 2019తో పోలిస్తే ఇది 40% పెరిగిందని చెప్పుకొచ్చాడు.