బఫెట్‌‌‌‌ను మించిన అదానీ!

బఫెట్‌‌‌‌ను మించిన అదానీ!

బఫెట్‌‌‌‌ను మించిన అదానీ!
రూ. 9.40 లక్షల కోట్లకు పెరిగిన సంపద
ఫోర్బ్స్ రిచ్‌‌‌‌‌‌‌‌ లిస్టులో టాప్-5 పొజిషన్‌‌‌‌‌‌‌‌కు గౌతమ్ అదానీ

న్యూఢిల్లీ : అదానీ గ్రూప్ బాస్ గౌతమ్ అదానీ సంపద వారెన్‌‌‌‌‌‌‌‌ బఫెట్‌‌‌‌‌‌‌‌ సంపదను అధిగమించింది. గ్లోబల్‌‌‌‌‌‌‌‌ రిచ్‌‌‌‌‌‌‌‌లిస్ట్‌‌‌‌‌‌‌‌లో ఆయన ఐదో ప్లేస్‌‌‌‌‌‌‌‌కు  చేరుకున్నారు.  ఫోర్బ్స్‌‌‌‌‌‌‌‌ డేటా ప్రకారం, గౌతమ్‌‌‌‌‌‌‌‌ అదానీ (59) సంపద  123.7 బిలియన్ డాలర్ల (రూ. 9.40 లక్షల కోట్ల) కు పెరిగింది.  వారెన్‌‌‌‌‌‌‌‌ బఫెట్ సంపద  121.7 బిలియన్ డాలర్లు కంటే అదానీ సంపద రెండు బిలియన్ డాలర్లు ఎక్కువ కావడం గమనించాలి. బెర్క్‌‌‌‌‌‌‌‌షైర్ హాతవే షేర్లు శుక్రవారం సెషన్‌‌‌‌‌‌‌‌లో 2 శాతం నష్టపోయాయి. దీంతో బఫెట్ సంపద తగ్గింది. మరోవైపు అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు దేశ మార్కెట్‌‌‌‌‌‌‌‌లో దూసుకుపోతున్నాయి. దీంతో ఆయన సంపద కూడా పెరుగుతోంది. అదానీ సంపద ఈ ఏడాదిలో ఇప్పటి వరకు 43 బిలియన్ డాలర్లు పెరగడం విశేషం. ప్రస్తుతం సంపద విషయంలో  ఎలన్ మస్క్‌‌‌‌‌‌‌‌, జెఫ్‌‌‌‌‌‌‌‌ బెజోస్, బెర్నార్డ్‌‌‌‌‌‌‌‌ ఆర్నాల్ట్‌‌‌‌‌‌‌‌, బిల్‌‌‌‌‌‌‌‌గేట్స్‌‌‌‌‌‌‌‌ మాత్రమే గౌతమ్‌‌‌‌ అదానీ కంటే ముందున్నారు. 

2 ఏళ్లలోనే 8.9 నుంచి 123 బిలియన్ డాలర్లకు..

వివిధ సెక్టార్లలో బిజినెస్ చేసే అదానీ గ్రూప్  మార్కెట్ క్యాపిటలైజేషన్ 151 బిలియన్ డాలర్లను క్రాస్ చేసింది. మొత్తం ఏడు అదానీ గ్రూప్ కంపెనీలు మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్టింగ్ అయ్యాయి.  పవర్ జనరేషన్‌‌‌‌‌‌‌‌ నుంచి పవర్ డిస్ట్రిబ్యూషన్‌‌‌‌‌‌‌‌, రిన్యూవబుల్ ఎనర్జీ, గ్యాస్ అండ్ ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, లాజిస్టిక్స్ (ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌, సీపోర్ట్స్‌‌‌‌‌‌‌‌, షిప్పింగ్‌‌‌‌‌‌‌‌, రైల్‌‌‌‌‌‌‌‌), మైనింగ్ అండ్ రీసోర్సెస్‌‌‌‌‌‌‌‌, మరికొన్ని సెక్టార్లలో అదానీ గ్రూప్ బిజినెస్ చేస్తోంది. ఫోర్బ్స్ డేటా ప్రకారం, రెండేళ్ల కిందట గౌతమ్ అదానీ సంపద కేవలం 8.9 బిలియన్ డాలర్లుగానే ఉంది. కిందటేడాది మార్చి నాటికి, ఆయన సంపద 50.5 బిలియన్ డాలర్లకు, ఈ ఏడాది మార్చి నాటికి 90 బిలియన్ డాలర్లకు ఎగిసింది. అదానీ గ్రూప్ కంపెనీల షేర్లు మల్టీబ్యాగర్లుగా మారడంతో ఆయన సంపద అమాంతం పెరిగింది. తాజాగా మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్టయిన అదానీ విల్మార్ కూడా ఇప్పటికే 185 %  లాభపడింది. అదానీ పవర్ మార్కెట్ క్యాప్‌‌‌‌ సోమవారం రూ. లక్ష కోట్ల మార్క్‌‌‌‌ను దాటింది. రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్‌‌ను దాటిన ఆరో అదానీ గ్రూప్‌‌ కంపెనీగా అదానీ పవర్ నిలిచింది.

మరిన్ని వార్తల కోసం..

ఎలక్ట్రిక్ బండ్లు పేలుతున్నయ్

కరీంనగర్​ యువ ఇంజినీర్ ​ప్రతిభ