Gautam Adani: మరో కంపెనీపై అదానీ కన్ను.. ఈసారి ఫుల్ పవర్ కోసమేనా..?

Gautam Adani: మరో కంపెనీపై అదానీ కన్ను.. ఈసారి ఫుల్ పవర్ కోసమేనా..?

Diamond Power Infra: దేశంలోని సంపన్న వ్యాపారవేత్తల్లో ఒకరుగా ఉన్న అదానీ పవర్ నుంచి డిఫెన్స్ వరకు అనేక వ్యాపారాల్లోకి విస్తిరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన మరికొన్ని కొత్త కంపెనీల షాపింగ్ కోసం ముమ్మరంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. 

గౌతమ్ అదానీ పవర్ రంగానికి చెందిన డైమండ్ పవర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ లిమిటెడ్ కంపెనీలో కీలక వాటా కొనుగోలుకు చూస్తున్నట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్ ఇప్పటికే కంపెనీతో చర్చిస్తున్నట్లు వెల్లడైంది. ఈ కంపెనీ కేబుల్స్, కండక్టర్లు, ట్రాన్స్‌మిషన్ టవర్లు, పవర్ డ్రిస్టిబ్యూషన్ పరికరాల తయారీ వ్యాపారంలో ఉందని తెలుస్తోంది. ఈ డీల్ ఫైనల్ అయితే అందానీ గ్రూప్ సప్లై చెయిన్ మరింత బలోపేతం కానున్నాయని తెలుస్తోంది.

►ALSO READ | Suzlon Stock: లక్షను రూ.39 లక్షలుగా చేసిన సుజ్లాన్ స్టాక్.. పరుగు ఇంకా మిగిలి ఉందా..?

వాస్తవానికి డైమండ్ పవర్ ఇన్ ఫ్రా సంస్థను 2022లో జీఎస్ఈసీ లిమిటెడ్ కంపెనీ కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం కంపెనీ షేర్లు బీఎస్ఈలో జాబితా అయి ఉన్న సంగతి తెలిసిందే. సెబీ రూల్స్ ప్రకారం కంపెనీ యజమానులు లేదా ప్రమోటర్లు మెుత్తం వాటాల్లో 75 శాతం మాత్రమే కలిగి ఉండాలి. కానీ డైమండ్ పవర్ కంపెనీ ప్రమోటర్లకు సంస్థలో 90 శాతం వరకు వాటాలు ఉన్నాయి. అందుకే వాటాల విక్రయానికి ప్రయత్నిస్తుండగా అదానీ గ్రూప్ వాటిని దక్కించుకునేందుకు పోటీ పడుతోంది. రానున్న 60 రోజుల్లో డీల్ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.