రూ. 1.3 లక్షల కోట్లు .. ఇన్వెస్ట్​ చేయనున్న అదానీ

రూ. 1.3 లక్షల కోట్లు .. ఇన్వెస్ట్​ చేయనున్న అదానీ

అహ్మదాబాద్:  అదానీ గ్రూప్ ఈ ఆర్థిక సంవత్సరంలో తన పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో కంపెనీలపై దాదాపు రూ. 1.3 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టాలని యోచిస్తోంది.  పోర్టుల నుంచి ఇంధనం, విమానాశ్రయాలు, కమోడిటీలు, సిమెంట్,  మీడియా వరకు ఉన్న పోర్ట్‌‌‌‌‌‌‌‌ఫోలియో కంపెనీల పెట్టుబడిలో 70 శాతం అంతర్గత నగదు ఉత్పత్తి ద్వారా,  మిగిలినది రుణాల ద్వారా సమకూరుతుందని గ్రూప్ సిఎఫ్‌‌‌‌‌‌‌‌ఓ జుగేషీందర్  సింగ్ ఇక్కడ విలేకరులతో అన్నారు.

 ఈ  సంవత్సరానికి మెచ్యూర్​ అయిన  3-4 బిలియన్ డాలర్ల రుణాన్ని రీఫైనాన్స్ చేస్తామని చెప్పారు.  ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్‌‌‌‌‌‌‌‌లో అదనంగా  బిలియన్ డాలర్లను సమీకరిస్తామని ఆయన అన్నారు. ఈ సంవత్సరం 6-7 గిగావాట్ల రెన్యువబుల్​ ఎనర్జీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌తోపాటు ముంబైలో కొత్త విమానాశ్రయం కూడా పూర్తవుతుందని చెప్పారు.  అదానీ గ్రూప్ కంపెనీలji 2024 ఆర్థిక సంవత్సరంలో పన్నుకు ముందు లాభం రికార్డు స్థాయిలో 45 శాతం పెరిగి రూ.82,917 కోట్లకు చేరిందని సింగ్ చెప్పారు.