అదానీ పోర్ట్స్ రెండో త్రైమాసిక నికర లాభం రూ.1,748 కోట్లు

అదానీ పోర్ట్స్ రెండో త్రైమాసిక నికర లాభం రూ.1,748 కోట్లు

అదానీ పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్ గురువారం తన నికర లాభం ప్రకటించింది. 2022తో ఇదే త్రైమాసికంతో పోలిస్తే.. 4.19 శాతం పెరిగిందని వెల్లడించింది. గతేడాది ఈ త్రైమాసికంలో నికరలాభం రూ. 1,677 .48 కోట్లు ఉండగా.. ఈ ఏడాది 1,747.85 కోట్లకు చేరుకుంది. గత ఏడాది ఇదే త్రైమాసికంలో రూ. 5, 210.80 కోట్ల ఆదాయం ఉండగా.. 27.6 శాతం పెరిగి రూ. 6,646.41 కోట్లకు చేరిందని అదానీ గ్రూప్ సంస్థ తెలిపింది. 

ఈ ఫైనాన్సియల్ ఇయర్ ఫస్ట్ క్వార్టర్స్ లో లాభం 33 శాతం పెరిగి రూ. 3,881 కోట్లకు చేరుకోగా.. అమ్మకాలు 26 శాతం పెరిగి రూ. 13,894 కోట్లకు చేరుకున్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి అర్థ భాగంలో Ebitda 46 శాతం పెరిగి రూ. 7,429 కోట్లకు చేరుకుంది.