
న్యూఢిల్లీ: ఫార్చ్యూన్ పేరుతో నూనెలను, పప్పులను, ఇతర ఆహార వస్తువలను అమ్మే అదానీ విల్మార్ తమ వంటనూనె ధరలను లీటరుకు రూ.30 వరకు తగ్గిస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచవ్యాప్తంగా నూనె ధరల పతనం కారణంగా ఈ నిర్ణయం తీసుకుంది. కొత్త ధరలతో కూడిన స్టాక్‌లు త్వరలో మార్కెట్‌లోకి రానున్నాయి. సోయాబీన్ ఆయిల్ ధరను రూ.195 నుంచి రూ.165కి ఫార్చ్యూన్ తగ్గించింది. సన్‌ఫ్లవర్ ఆయిల్ ధరను రూ.210 నుంచి రూ.199కి తగ్గించింది. మస్టర్డ్ ఆయిల్ ధరను రూ.195 నుండి రూ.190కి, రైస్ బ్రాన్ ఆయిల్ ధర రూ. 225 నుండి రూ. 210కి తగ్గించింది. వేరుశెనగ నూనె రేటు రూ. 220 నుండి రూ. 210కి తగ్గనుంది. కాగా, ధారా బ్రాండ్‌తో ఎడిబుల్ ఆయిల్‌లను అమ్మె మదర్ డెయిరీ కూడా సోయాబీన్, రైస్ బ్రాన్ ఆయిల్‌ల ధరలను లీటరుకు రూ.14 వరకు తగ్గించింది.