
- 80 శాతం ఎంఎస్‌ఎంఈల నుంచే: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
న్యూఢిల్లీ: గవర్నమెంట్ తీసుకొచ్చిన రూ.23 వేల కోట్ల ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫాక్చరింగ్ స్కీమ్ (ఈసీఎంఎస్) కోసం 70 అప్లికేషన్స్ వచ్చాయని యూనియన్ మినిస్టర్ అశ్వినీ వైష్ణవ్ పేర్కొన్నారు. 80 శాతం అప్లికేషన్లు స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ కంపెనీ ((ఎంస్‌ఎంఈ)ల నుంచి వచ్చాయని తెలిపారు. ఈ స్కీమ్‌ను ప్రారంభించిన 15 రోజుల్లో ఈ అప్లికేషన్స్ అందాయి. "ఈసీఎంఎస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. అప్లికేషన్ల కోసం ఓపెన్ చేసిన 15 రోజుల్లో సుమారు 70 అప్లికేషన్స్ వచ్చాయి" అని వైష్ణవ్ వివరించారు. అప్లికెంట్స్ పేర్లను మినిస్టర్ బయటపెట్టలేదు. కానీ టాటా ఎలక్ట్రానిక్స్, డిక్సన్ టెక్నాలజీస్, ఫాక్స్‌కాన్ లాంటి పెద్ద కంపెనీలు ఆసక్తి చూపించాయని తెలిసింది. వైష్ణవ్ మాట్లాడుతూ, కొన్ని పెద్ద కంపెనీలు అప్లయ్ చేసినప్పటికీ, ఎంఎస్‌ఎంఈల నుంచే ఈ స్కీమ్ కోసం ఎక్కువ అప్లికేషన్లు వచ్చాయని అన్నారు.
కాగా, ప్రభుత్వం రూ. 22,805 కోట్లతో ఈసీఎంఎస్‌ను లాంచ్ చేసింది. ఈ నెల 1 నుంచి అప్లికేషన్స్ తీసుకుంటోంది. ఈ స్కీమ్ కింద ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్లను తయారు చేసే కంపెనీలకు రాయితీలను ఇవ్వనున్నారు. ఎలక్ట్రానిక్స్ సెగ్మెంట్‌లో డిమాండ్, సప్లయ్ మధ్య పెరుగుతున్న గ్యాప్‌ను తగ్గించడానికి ప్రభుత్వం ఈ స్కీమ్‌ను మొదలు పెట్టింది. ఇండియాలోనే ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ల తయారీని ప్రోత్సహిస్తోంది. ఈ స్కీమ్ కింద రూ.21,093 కోట్లను కెమెరా మాడ్యూల్, మల్టీ-లేయర్డ్ ప్రింటెడ్ సర్క్యూట్ బోర్డ్ (పీసీబీ), ఫ్లెక్సిబుల్ పీసీబీ, పీసీబీలో మెషీన్స్ ద్వారా ఫిక్స్ చేసే పాసివ్ కాంపోనెంట్స్ లాంటి సబ్-అసెంబ్లీస్ కోసం కేటాయించారు. సబ్-అసెంబ్లీస్‌లో ఉపయోగించే పార్ట్స్, ఎలక్ట్రానిక్స్ తయారు చేసే కంపెనీలకు రూ.1,712 కోట్లను రాయితీగా ఇవ్వనున్నారు.