వెంకటాపురం, వెలుగు: ములుగు జిల్లా వాజేడు మండలం చెరుకూరులో ఇంటర్ స్టేట్ చెక్ పోస్ట్ అడిషనల్ కలెక్టర్ సీహెచ్ మహేందర్ జీ బుధవారం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చత్తీస్గడ్నుంచి అక్రమంగా ధాన్యం రవాణా జరగకుండా చెక్ పోస్ట్ ఏర్పాటు చేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో పౌరసరఫరాల శాఖ జిల్లా మేనేజర్ బి.రాంపతి, ఇతర అధికారులు తదితరులు పాల్గొన్నారు.
