తహసీల్దార్​ ఆఫీస్​ను తనిఖీ చేసిన అడిషనల్​ కలెక్టర్

తహసీల్దార్​ ఆఫీస్​ను తనిఖీ చేసిన అడిషనల్​ కలెక్టర్

వీపనగండ్ల.వెలుగు:  వనపర్తి జిల్లా అడిషనల్​ కలెక్టర్ తిరుపతిరావు శనివారం  వీపనగండ్ల తహసీల్దార్​ ఆఫీస్​ను  ఆకస్మికంగా తనిఖీ చేశారు.   ఇబ్బందికరంగా ఉన్న తహసీల్దార్​ ఆఫీస్​ ను  మరో భవనం లోకి  మార్చేందుకు  ప్రభుత్వ భవనాలను పరిశీలించారు.

 బీసీ బాలుర వసతి గృహం, బీసీ పాఠశాల, మండల పరిషత్ కార్యాలయం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం తో పాటు ప్రైవేట్ బిల్డింగును పరిశీలించారు. కార్యక్రమంలో తహసీల్దార్​ వరలక్ష్మి, ఎంపీటీసీ భాస్కర్ రెడ్డి, మండల రైతుబంధు సమితి మాజీ అధ్యక్షుడు ఎత్తం కృష్ణయ్య, కాంగ్రెస్  నాయకులు లోడుగు రాజు, చిన్న రాంబాబు తదితరులు ఉన్నారు.