
- అదనంగా ఎస్కార్ట్ వాహనం
- ఇంటలిజెన్స్ హెచ్చరికలతో భద్రత పెంపు
హైదరాబాద్: బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు భద్రత పెంచారు. ముప్పు పొంచి ఉందని ఇంటలిజెన్స్ హెచ్చరికలతో బండి సంజయ్‌కు 1+5 (కానిస్టేబుళ్లు)తో రోప్ పార్టీ ఏర్పాటు చేయడంతో పాటు వారి కోసం అదనంగా ఎస్కార్ట్ వాహనం ఏర్పాటు చేశారు పోలీసులు. హైదరాబాద్ పరిధిలో మరింత అప్రమత్తంగా వ్యవహరించేందుకు భద్రత పెంచాలని ఇంటలిజెన్స్ సూచించినట్లు తెలుస్తోంది. కరీంనగర్‌లో చేసిన వ్యాఖ్యలతో బండి సంజయ్‌కు ముప్పు ఉన్నట్లు ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చింది. ప్రస్తుతం అగ్నిపథ్ లాంటి తాజా పరిస్థితుల నేపథ్యంలో బండి సంజయ్ భద్రతపై సమీక్షించి అదనపు ఏర్పాటు చేసింది పోలీసు శాఖ.