ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసమే ఫ్లాగ్ మార్చ్

ప్రజల్లో ఆత్మవిశ్వాసం కోసమే ఫ్లాగ్ మార్చ్

మక్తల్, వెలుగు: శాంతియుత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించడానికి జిల్లా పోలీసులు, కేంద్ర సాయుధ బలగాలతో ఫ్లాగ్ మార్చ్ నిర్వహించినట్లు అడిషనల్  ఎస్పీ నాగేంద్రుడు తెలిపారు. మంగళవారం సాయంత్రం మండలంలోని సమస్యాత్మక గ్రామాలైన దాసరిదొడ్డి, కర్ని గ్రామాల్లో ఫ్లాగ్ మార్చ్  నిర్వహించారు. 

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు, ప్రజల్లో ఆత్మ విశ్వాసం నింపేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రజలు ఎటువంటి ఇబ్బంది లేకుండా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు. ఎస్ఐ పర్వతాలు పాల్గొన్నారు.