
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామని అడిషనల్ ఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం సీఐ అశోక్ రెడ్డి, ట్రాఫిక్ ఆర్ఎస్ఐ కల్యాణ్ తో కలిసి అడిషనల్ ఎస్పీ నాగర్ కర్నూల్ పట్టణంలోని పలు చౌరస్తాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ తరహాలో నాగర్కర్నూల్పట్టణంలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేస్తామన్నారు.
ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా జిల్లాలో ట్రాఫిక్ సిగ్నల్స్ ఏర్పాటు చేసే ఏరియాలను గుర్తించామని చెప్పారు. శ్రీపురం రోడ్, గవర్నమెంట్ హాస్పిటల్, బస్టాండ్, నాగనూల్ చౌరస్తాలతోపాటు మరికొన్ని ఏరియాల్లో ట్రాఫిక్సిగ్నల్స్ఏర్పాటు చేస్తామన్నారు.