ఆది సాయికుమార్, అర్చనా అయ్యర్ జంటగా యుగంధర్ ముని దర్శకత్వంలో రాజశేఖర్ అన్నభీమోజు , మహిధర్ రెడ్డి నిర్మిస్తున్న చిత్రం ‘శంబాల’. డిసెంబర్ 25న సినిమా విడుదల కానుంది. రీసెంట్‌గా ఈ మూవీ ట్రైలర్‌ను ప్రభాస్ లాంచ్ చేయగా, దానికి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా నిర్వహించిన ఈవెంట్‌లో ఆది సాయికుమార్ మాట్లాడుతూ ‘మా ప్రమోషనల్ కంటెంట్‌కు అన్ని చోట్లా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుండటం ఆనందంగా ఉంది.
ఈ చిత్రం కచ్చితంగా ఏ ఒక్కరినీ నిరాశపర్చదు. అందరినీ ఆకట్టుకునేలా ఉంటుంది. మాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్’ అని చెప్పాడు. ఈ చిత్రంతో తాను మంచి పాత్రను పోషించానని అర్చనా అయ్యర్ చెప్పింది.
దర్శకుడు యుగంధర్ ముని మాట్లాడుతూ ‘ఇది థియేటర్‌లో చూడాల్సిన సినిమా. ట్విస్ట్, టర్న్స్ అన్నీ సర్ప్రైజ్ చేస్తాయి. ఇందులోని ప్రతి పాత్ర ఆడియెన్స్‌కి గుర్తుండిపోతుంది’ అని అన్నాడు. నటులు రవి వర్మ, మధు నందన్, ఇంద్రనీల్ పాల్గొన్నారు.
