టాలీవుడ్ టాలెంటెడ్ హీరో అడవి శేష్, మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రల్లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘డెకాయిట్’ (Dacoit). ఎన్నో రోజులుగా వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకొచ్చింది. ప్రేమ, ద్రోహం, ప్రతీకారం అనే అంశాల చుట్టూ తిరిగే ఈ యాక్షన్ డ్రామా ఏప్రిల్ 10, 2026న థియేటర్లలో విడుదలైంది.
ఈ చిత్రంతో షనీల్ డియో దర్శకుడిగా పరిచయమవుతున్నారు. గతంలో అడవి శేష్ చిత్రాలకు సినిమాటోగ్రాఫర్‌గా పనిచేసిన ఆయన, శేష్‌తో కలిసి ఈ కథను సిద్ధం చేశారు. అడవి శేష్ సినిమా అంటేనే, కంటెంట్‌పై నమ్మకం ఉండటం సహజం. టీజర్, ట్రైలర్ కూడా అదే స్థాయిలో అంచనాలను పెంచేశాయి కూడా. మరి ఆ అంచనాలకు సినిమా న్యాయం చేసిందా? లేదా అనేది రివ్యూలో తెలుసుకుందాం.
డెకాయిట్ కథ:
తక్కువ కులానికి చెందిన హరి అలియాస్ హరిదాస్ (అడవి శేష్), గొప్పింటి అమ్మాయి సరస్వతి(మృణాల్ ఠాకూర్) ప్రేమించుకుంటారు. కానీ, ఓ కేసులో సరస్వతి తప్పుడు సాక్ష్యం చెప్పి హరిని జైలుకు పంపిస్తుంది. ప్రాణంగా ప్రేమించిన అమ్మాయే అబద్దం చెప్పి జైలులో పెట్టించడంతో సరస్వతిపై పగ పెంచుకుంటాడు హరి. అలా 13 ఏళ్లు హరి జైలులోనే ఉండాల్సి వస్తుంది.
ఈ క్రమంలోనే ఓరోజు హరిని కడప జైలు నుంచి మారుస్తుండగా పోలీసుల నుంచి తప్పించుకుంటాడు. దుబాయ్ వెళ్లాలని ఫిక్స్ అవుతాడు. కానీ, దానికోసం ఇంకా రూ.60లక్షలకు పైగా డబ్బు అవసరమవుతుంది. ఇదే సమయంలోనే, తనని మోసం చేసిన సరస్వతిపై హరి ప్రతీకారం తీర్చుకోవాలని డిసైడ్ అవుతాడు.
కానీ సరస్వతి అప్పటికే కుటుంబ సమస్యలతో, డబ్బు కోసం పోరాడుతూ ఉంటుంది. తన భర్త ప్రాణాలను కాపాడాలంటే కోటి రూపాయలు అవసరం పడుతుంది. ఈ పరిస్థితిని ఉపయోగించుకోవాలని హరి ప్లాన్ చేస్తాడు. అలా తమ పరిస్థితుల వల్ల ఇద్దరూ మళ్లీ కలసి డబ్బు కోసం ఒక ప్లాన్ చేస్తారు. ఆ ప్రయాణంలో పాత ప్రేమ, ద్రోహం, నిజాలు ఒక్కొక్కటిగా బయటపడతాయి.
ఇంతకీ హరిని, సరస్వతి జైలుకి ఎందుకు పంపించింది? వారి గతానికి అసలు కారణం ఏంటి? ఎవరు ఎవరిని ఎందుకు మోసం చేశారు? చివరికి హరి ప్రతీకారం తీసుకుంటాడా? ఈ కథలో మల్లి (కామాక్షి భాస్కర్ల), సీఐ స్వామి (అనురాగ్ కశ్యప్) పాత్రలు ఎందుకు కీలకం? అన్నది కథలో ట్విస్ట్.
డెకాయిట్ విశ్లేషణ:
టాలీవుడ్‌లో కంటెంట్ ఆధారిత చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు అడవిశేష్. అలాంటిది ఈ డెకాయిట్’ మూవీకి తనే స్వయంగా కథ, స్క్రీన్‌ప్లే అందించడంతో ప్రేక్షకుల్లో భారీ హైప్ వచ్చింది. ముఖ్యంగా ఈ సినిమా ప్రేమ, ద్రోహం, ప్రతీకారం అనే మూడు అంశాల చుట్టూ రాసుకోవడం సినిమాకు కలిసొచ్చింది.
అంతేకాకుండా, ఈ చిత్రం, సాధారణ రివెంజ్ డ్రామా కంటే లోతైన భావోద్వేగాలను ప్రతిబింబించడానికి ప్రయత్నించింది. సరస్వతి తప్పుడు సాక్ష్యం కారణంగా హరి జైలుకు వెళ్లడం, 13 ఏళ్ల తరువాత అతని జీవితంలో ప్రతీకారం మాత్రమే మిగలడం కథపై ఇంట్రెస్ట్ పెంచుతోంది.
ఇందులో భాగంగానే, శేష్ తనదైన మార్క్ శైలిలో ట్విస్ట్‌లు, టర్నింగ్ పాయింట్స్ రాసుకుని ఆడియన్స్ ని పూర్తిగా ఎంగేజ్ చేశాడు. సాధారణ ప్రేమకథలకి భిన్నంగా కథ, కథనం తీర్చిద్దిద్ధి శేష్ శభాష్ అనిపించుకున్నాడు. ఈ క్రమంలోనే శేష్ కి డైరెక్టర్ షానిల్ విజన్ తోడుగా నిలిచి సినిమాకు పెద్ద బలంగా నిలిచింది.
నిజమైన ప్రేమ ఎప్పుడూ ప్రతీకారాన్ని కోరుకోదు. ఎలాంటి త్యాగానికి అయినా సిద్ధపడుతుందనే అంశాన్ని క్రైమ్ ఎలిమెంట్, రివేంజ్ డ్రామాను జోడించి హార్ట్ ఫుల్ ఎమోషనల్ లవ్‌స్టోరీగా తెరకెక్కించడంలో సక్సెస్ అయ్యాడు డైరెక్టర్ షానిల్ డియో. సినిమాలో వచ్చే ట్విస్టులు దాదాపు ఊహించడం కష్టం.
జైలు నుంచి హీరో తప్పించుకోవడం, ట్రైన్ యాక్సిడెండ్, దొంగతనాలు, ఛేజింగ్ సీన్స్, హాస్పిటల్ హార్ట్ సర్జరీ వంటి సీన్స్ మెప్పిస్తాయి. క్లైమాక్స్ చాలా ఎమోషనల్‌గా తీర్చిదిద్దారు. అయితే, ఎండింగ్ బాగానే ఉంటుంది. కానీ, ఆడియెన్స్ ఎలా స్వీకరిస్తారో తెలియాల్సి ఉంది.
నటి నటులు:
హరి పాత్రలో అడవి శేష్ తన ఇంటెన్స్ పెర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నాడు. వన్ మ్యాన్ షో చేశాడు. మదనపల్లి యాసలో డైలాగ్స్ కొత్తగా ఉంటాయి. సరస్వతి పాత్రలో మృణాల్ ఠాకూర్ మోసాన్ని, భావోద్వేగాలను సరైన రీతిలో వ్యక్తపరిచింది. ఈ రెండు పాత్రల మధ్య ఉన్న కెమిస్ట్రీ సినిమా హైలైట్‌గా నిలుస్తుంది.
సీఐ స్వామిగా అనురాగ్ కశ్యప్ స్క్రీన్ ప్రెజెన్స్ మెస్మరైజింగ్ గా ఉంటుంది. ప్రకాశ్‌రాజ్, సునీల్, కామాక్షి భాస్కర్ల, అతుల్ కులకర్ణి తమ పాత్రల పరిధి మేరకు నటించి ఆకట్టుకున్నారు.
