
అమ్రాబాద్, వెలుగు: మన్ననూర్ ఐటీడీఏ పరిధిలోని జడ్చర్ల, గండీడ్, బిజినేపల్లి, లింగాల, అమ్రాబాద్ మినీ గురుకులాల్లో అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకోవాలని రీజినల్ కో- ఆర్డినేటర్ కె.సుధాకర్ కోరారు. జడ్చర్లలో ఒకటవ తరగతిలో 30 సీట్లు, 5వ తరగతిలో 11, గండీడ్ లో ఒకటవ తరగతిలో 30, రెండవ తరగతిలో 17, నాల్గవ తరగతిలో 1, 5వ తరగతిలో 8, బిజినేపల్లిలో ఒకటవ తరగతిలో 30, రెండవ తరగతిలో 2, 5వ తరగతిలో 4, లింగాలలో ఒకటవ తరగతిలో 30, రెండవ తరగతిలో 15, ఐదవ తరగతిలో 7, అమ్రాబాద్ లో ఒకటవ తరగతిలో 30, రెండవ తరగతిలో 6, మూడవ తరగతిలో 1 సీట్ ఖాళీగా ఉన్నాయని చెప్పారు. సంబంధిత మండలాలకు చెందిన పీవీటీజీ, గిరిజన విద్యార్థులు వచ్చే నెల 6లోగా దరఖాస్తు చేసుకోవాలని, 9న లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామని తెలిపారు. పూర్తి వివరాల కోసం 9491030260(జడ్చర్ల), 9494884630 (గండీడ్), 6304353881 (బిజినేపల్లి), 9014987924 (లింగాల), 7732082256 (అమ్రాబాద్) నంబర్లలో సంప్రదించాలని సూచించారు.