కొత్తగూడెంలో నర్సింగ్ కాలేజీలకు అడ్మిషన్లు షురూ

కొత్తగూడెంలో నర్సింగ్ కాలేజీలకు అడ్మిషన్లు షురూ
  • కొత్తగూడెంలో నర్సింగ్ కాలేజీలకు అడ్మిషన్లు షురూ
  • సెకండ్ ఫేజ్​లో వెబ్ ​ఆప్షన్ల ద్వారా  60సీట్ల భర్తీకి పర్మిషన్​
  • బస్టాండ్ సెంటర్​లో ఓ బిల్డింగ్​లో కొనసాగనున్న కాలేజీ 
  • ఇంకా పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీని నియమించలే..
  • జనవరిలో క్లాసులు స్టార్ట్​ అయ్యే అవకాశం

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: జిల్లాకు మంజూరైన నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లకు పర్మిషన్​వచ్చింది. సెకండ్​ఫేజ్​లో వెబ్ ఆప్షన్ల ద్వారా అడ్మిషన్లు భర్తీ చేసుకునేందుకు కాళోజీ హెల్త్​యూనివర్సిటీ నుంచి అనుమతించింది. ఇప్పటికే నర్సింగ్​ఫస్ట్​ఫేజ్​కౌన్సెలింగ్​పూర్తయింది. సెకండ్​ఫేజ్​కౌన్సెలింగ్​ఈ నెల 9 నుంచి ప్రారంభం కానుంది.  థర్డ్​ఫేజ్ కౌన్సెలింగ్​కంప్లీట్​అయ్యాక జనవరిలో క్లాస్​లు ప్రారంభం కానున్నాయి. ఫస్ట్​ ఇయర్​లో 60 సీట్లు జిల్లాలోని పాల్వంచలో గతేడాది నర్సింగ్ కాలేజీ మంజూరైంది. పాల్వంచలో బిల్డింగ్ నిర్మాణం చేపట్టారు. ఇదే టైంలో జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరయింది. దానికి బిల్డింగ్​లేకపోవడంతో టెంపరరీగా ఈ బిల్డింగ్​ను మెడికల్​కాలేజీకి కేటాయించారు. దీంతో నర్సింగ్ కాలేజీ మంజూరుపై సందిగ్ధత నెలకొంది. అయితే ఈ అకడమిక్​ ఇయర్​లో ఎలాగైనా నర్సింగ్ కాలేజీని ప్రారంభించాలని అధికారులు చర్యలు చేపట్టారు. కొత్తగూడెంలోని బస్టాండ్ సెంటర్​లో ఓ బిల్డింగ్​ను రెంట్​కు తీసుకున్నారు. ఇటీవల ఈ బిల్డింగ్​ను స్టేట్ నర్సింగ్ కాలేజ్​, కాళోజీ హెల్త్​యూనివర్సిటీ ప్రతినిధి బృందం సందర్శించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో అడ్మిషన్ల భర్తీకి యూనివర్సిటీ ఆమోదం తెలిపింది. ఈనెల 9నుంచి సెకండ్ ఫేస్ వెబ్ ఆప్షన్లకు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్, కాళోజి హెల్త్ యూనివర్సిటీ నుంచి అనుమతి లభించింది. ఫస్ట్ ఇయర్​లో 60 సీట్లు భర్తీ చేసేందుకు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ పర్మిషన్​ఇచ్చింది. ఇప్పటివరకు కాలేజీకి ప్రిన్సిపాల్, వైస్​ప్రిన్సిపాల్​ను నియమించారు. ఇంకా పూర్తిస్థాయిలో ఫ్యాకల్టీ రావలసి ఉంది. నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు పర్మిషన్​రావడంపై కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య హర్షం వ్యక్తం చేశారు. 

వెబ్ ఆప్షన్లు పెట్టుకోండి

జిల్లాలోని కొత్తగూడెంలో ఏర్పాటు చేయనున్న నర్సింగ్ కాలేజీలో బీఎస్సీ నర్సింగ్ కోర్స్ లో చేరేందుకు విద్యార్థులు వెబ్ ఆప్షన్లు పెట్టుకోవాలి. జిల్లా వాసులతోపాటు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో చెందిన అభ్యర్థులు అడ్మిషన్లు పొందవచ్చు. థర్డ్​ఫేజ్​లోనూ వెబ్ ఆప్షన్ ద్వారా అడ్మిషన్ పొందే అవకాశం ఉంది.

- పి జ్యోతి, ప్రిన్సిపల్

నర్సింగ్ కాలేజీ జిల్లా అభివృద్ధికి దోహదం

కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతిజిల్లాలో మెడికల్ కాలేజీలతోపాటు నర్సింగ్ కాలేజీలు మంజూరు చేస్తోంది. దీనిలో భాగంగా భద్రాద్రి జిల్లాకు మెడికల్​కాలేజీతోపాటు నర్సింగ్​కాలేజీ రావడం హర్షనీయం. ఏజెన్సీ ప్రాంతమైన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు అవకాశం ఏర్పడింది.  

నామా నాగేశ్వరరావు, ఖమ్మం ఎంపీ 

స్టూడెంట్స్​ సద్వినియోగం చేసుకోవాలి

జిల్లాకు మంజూరైన మెడికల్ కాలేజీలో క్లాసులు ప్రారంభమయ్యాయి. నర్సింగ్ కాలేజీలో అడ్మిషన్లు పొందేందుకు సెకండ్​ఫేజ్​వెబ్​కౌన్సెలింగ్​లో పాల్గొనవచ్చు. జిల్లా స్టూడెంట్స్ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి.
అనుదీప్, కలెక్టర్, భద్రాద్రి కొత్తగూడెం