దొంగగా మారిన పోలీస్ డాగ్!.. వీడియో

దొంగగా మారిన పోలీస్ డాగ్!.. వీడియో

పోలీస్ స్టేషన్‌లోనే దొంగతనం జరిగింది. క్రిస్మస్ ఫెస్టివల్ సందర్భంగా పిల్లలకు పంచాలని తెచ్చి.. దాచిన బొమ్మలు ఒక్కొక్కటిగా మిస్సవుతున్నాయి. ఎప్పుడూ పోలీసులు తిరుగుతూ ఉండే అక్కడికి వచ్చి వాటిని ఎవరు కొట్టేస్తున్నార్నది వాళ్లకు అంతుబట్టలేదు. చివరికి దొంగ బయటపడ్డాక పోలీసులు అవాక్కయ్యారు. ఆ చిలిపి దొంగ తమ స్టేషన్‌లో ఉందన్న విషయాన్ని ఓ ఆఫీసర్ గుర్తించి.. చోరీ సీన్ మొత్తాన్ని వీడియో తీసి.. రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇంతకీ దొంగ ఎవరనకుంటున్నారూ..? పోలీస్ డాగ్.. అవును.. ఆ స్టేషన్‌లో ఉండే గోల్డెన్ రిట్రైవర్ డాగ్!

అమెరికాలోని మసాచూసెట్స్‌లోని ఫ్రాంక్లిన్ పోలీసులు తమ స్టేషన్‌లో జరిగిన ఈ ఫన్నీ ఇన్సిడెంట్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. శాంటా ఫౌండేషన్‌ ద్వారా క్రిస్మస్ నాడు చిన్న పిల్లలకు టాయ్స్ పంచాలని ఫ్రాంక్లిన్ పోలీసులు తమ ఆఫీసులో దాచి ఉంచారు. వాటిని ప్యాక్ చేసి, ఇవ్వాలని అక్కడ పెట్టారు. కానీ ఒక్కొక్కటిగా కొన్ని బొమ్మలు మిస్ అవడంతో దానిపై దర్యాప్తు చేశారు పోలీసులు. ఆ టాయ్స్ ఉంచిన రూమ్‌పై నిఘా వేశారు. ఆ స్టేషన్‌లో ఉండే పోలీస్ డాగ్ స్లిలీనే ఆ బొమ్మల్ని నోటితో పట్టుకుని వెళ్లి తన రూమ్‌లో దాచుకోవడం చూశారు ఓ ఆఫీసర్. ఆ మొత్తం సీన్ వీడియో తీసి తమ ఫేస్‌బుక్‌ పేజ్‌లో పెట్టారు.

Say what you want, but his mouth eye coordination could use some work…

Posted by Franklin Police Department on Wednesday, December 18, 2019

‘మేం ఓ అద్భుతమైన పాఠం నేర్చుకున్నాం. రూమ్ నిండా బొమ్మలు ఉన్నప్పుడు డోర్ లాక్ చేయాలి. లేదా బాగా హైట్‌ ఉన్న ప్లేస్‌లో వాటి ఉంచాలి. అలా కాదంటే గోల్డెన్ రిట్రైవర్ డాగ్ వాటిని దాని రూమ్‌లో దాచేస్తది. దీన్ని వీడియో తీసిన.. రెడ్ హ్యాండెడ్‌గా దొంగని పట్టించిన ఆఫీసర్‌కి థ్యాంక్స్’ అంటూ ఫేస్‌బుక్‌లో పోస్టు చేశారు. ఈ వీడియోకు నెటిజన్లు ఫిదా అయ్యారు. ఆ కుక్క చేసిన పని చాలా క్యూట్‌గా ఉందంటూ కామెంట్లు చేశారు.