సీజనల్ వ్యాధులపై అలెర్ట్​గా ఉండాలి : అద్వైత్ కుమార్ సింగ్

సీజనల్ వ్యాధులపై అలెర్ట్​గా ఉండాలి : అద్వైత్ కుమార్ సింగ్

మహబూబాబాద్, వెలుగు: వర్షాకాలంలో సీజనల్‌ వ్యాధులు ప్రబలకుండా సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని మహబూబాబాద్​ కలెక్టర్‌ అద్వైత్ కుమార్ సింగ్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ వైద్యారోగ్య శాఖ, పంచాయతీ, మున్సిపల్‌, విద్య, సంక్షేమ శాఖ, సంక్షేమ హాస్టళ్ల అధికారులు సమన్వయం చేసుకుంటూ సీజనల్‌ వ్యాధులను అరికట్టాలని సూచించారు. 

డ్రైనేజీలు శుభ్ర పర్చాలని, తాగునీరు కలుషితం కాకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. నీటి ట్యాంకులను శుభ్ర పర్చి క్లోరినేషన్‌తో పాటు వారానికి రెండు రోజులు డ్రై డేగా పాటించాలన్నారు. ఏసీ డూవిడ్, డీఎంహెచ్​వో కళావతి బాయి, వివిధ శాఖల అధికారులు తదితరులున్నారు.