ఖమ్మం సిటీలోని న్యూ ఆర్టీసీ బస్టాండ్ లో అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ ప్రారంభం

ఖమ్మం సిటీలోని న్యూ ఆర్టీసీ బస్టాండ్ లో అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ ప్రారంభం

ఖమ్మం టౌన్, వెలుగు : ఖమ్మం సిటీలోని న్యూ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికులకు మరింతగా మెరుగైన సేవలు అందించేందుకు అడ్వాన్స్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ ను శుక్రవారం ఆర్టీసీ ఆర్ఎం సరిరాం ప్రారంభించారు. టికెట్ బుకింగ్ సేవలో ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని ఆర్ఎం సూచించారు.  ఈ కార్యక్రమంలో డిప్యూటీ రీజినల్ మేనేజర్ మల్లయ్య, ఖమ్మం డిపో మేనేజర్ శివప్రసాద్, భద్రాచలం డిపో మేనేజర్ జంగయ్య, బస్టాండ్ కంట్రోలర్ తదితరులు పాల్గొన్నారు.