మోడీ శెభాష్… కల నెరవేర్చావ్: అద్వానీ

మోడీ శెభాష్… కల నెరవేర్చావ్: అద్వానీ

బీజేపీ కురువృద్ధుడు ఆ పార్టీ సీనియర్ నేత ఎల్ కే అద్వానీ ప్రధాని మోడీకి శుభాకాంక్షలు తెలిపారు. సింగిల్ లార్జెస్ట్ పార్టీగా బీజేపీని నిలిపినందుకు  ఆనందంగా ఉందని అన్నారు. అమిత్ షా- మోడీ ద్వయం పార్టీకి అద్భుతమైన విజయాన్ని కూడగట్టారని ఆయన అన్నారు.

దేశం మొత్తం 543 లోక్ సభ స్థానాలు ఉండగా.. బీజేపీ ఇప్పటి వరకు 123 స్థానాలలో గెలుపొంది 176 స్థానాలలో ఆధిక్యంలో ఉంది. దీంతో దేశంలోనే సింగిల్ లార్జెస్ట్ పార్టీ గా అవతరించనుంది. 2014వ లోక్ సభ ఎలక్షన్స్ లో 282 స్థానాలలో గెలిచిన బీజేపీ ఈ సారి మాత్రం ఆ ఫిగర్ ను దాటి ఏకంగా 300 స్థానాలలో సింగిల్ గా గెలువనుంది. దీంతో దేశ వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు సంబరాలలో మునిగారు.