ఏఈ ఫైనల్ కీ రిలీజ్

ఏఈ ఫైనల్ కీ రిలీజ్

 హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని వివిధ డిపార్ట్ మెంట్లలో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఇంజినీర్ (ఏఈ) పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షకు సంబంధించిన ఫైనల్ కీని టీఎస్ పీఎస్సీ గురువారం రిలీజ్ చేసింది. గతేడాది అక్టోబర్ లో జరిగిన పరీక్షలకు సంబంధించి నవంబర్ 1న ప్రాథమిక కీ రిలీజ్ చేశారు. ఆ తర్వాత అభ్యర్థుల నుంచి అభ్యంతరాలను స్వీకరించి..  గురువారం ఫైనల్ కీ రిలీజ్ చేసినట్టు కమిషన్ ప్రకటించింది. ఫైనల్ కీని వెబ్ సైట్ లో పెట్టామని పేర్కొంది.