
హైదరాబాద్, వెలుగు: వ్యాపారాలు, డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లకు మాడ్యులర్ ఎర్గోనామిక్ ఆఫీస్ సొల్యూషన్‌లను అందించేందుకు ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌ను ఏఎఫ్‌సీ ఫర్నిచర్ సొల్యూషన్స్ హైదరాబాద్‌లో ప్రారంభించింది. ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ ఫ్లెక్సిబుల్ వర్క్‌స్పేస్ రంగాల అవసరాలను ఇది తీర్చుతుందని తెలిపింది. బంజార్హిల్స్లో దీనిని5000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు.
ఇక్కడ పూర్తి శ్రేణి మాడ్యులర్ ఫర్నిచర్, ఎర్గోనామిక్ కుర్చీలను కొనుక్కోవచ్చు. హైదరాబాద్ ఆఫీస్ మార్కెట్ వేగంగా విస్తరిస్తోంది. 2025 మొదటి క్వార్టర్లో లీజింగ్ కార్యకలాపాలు 111శాతం పెరిగాయి. ప్రస్తుతం నగరంలోని ఆఫీస్ స్టాక్ 123 మిలియన్ చదరపు అడుగులు దాటిందని, ఇది భారతదేశం మొత్తం ఆఫీస్ మార్కెట్‌లో 12శాతం వాటాకు సమానమని ఏఎఫ్‌సీ తెలిపింది.