Asia Cup 2025: కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. ఆసియా కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ప్రకటన..

Asia Cup 2025: కెప్టెన్‌గా రషీద్ ఖాన్.. ఆసియా కప్‌కు ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్ ప్రకటన..

యూఏఈ వేదికగా వచ్చే నెలలో జరగనున్న ఆసియా కప్ కోసం ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు (ACB) తమ ప్రిలిమినరీ స్క్వాడ్ ను ప్రకటించింది. 22 మందితో కూడిన ప్రాబబుల్స్ ను మంగళవారం (ఆగస్టు 5) ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ బోర్డు రిలీజ్ చేసింది. ఈ జట్టుకు రషీద్ ఖాన్ కెప్టెన్సీ చేయనున్నాడు.  ఈ కాంటినెంటల్ ఈవెంట్ సెప్టెంబర్ 9 నుండి 26 వరకు జరగనుంది. ఆసియా కప్ కంటే ముందు ఆఫ్ఘనిస్తాన్ షార్జా వేదికగా పాకిస్థాన్, యూఏఈ లతో ట్రై సిరీస్ ఆడనుంది. ఈ సిరీస్ ఆసియా కప్ కు సన్నాహకంగా ఉపయోగపడుతుంది. 

స్క్వాడ్ లో ఎంపికైన ఆటగాళ్లు ట్రై-సిరీస్, ఆసియా కప్‌కు ముందు రెండు వారాల ప్రాక్టీస్ ప్రారంభించనున్నారు. స్క్వాడ్ లో ఎంపికైన ఆటగాళ్లలో ఎక్కువ మంది ఇటీవల ఆఫ్ఘనిస్తాన్‌లో జరిగిన డొమెస్టిక్ టీ20 టోర్నీ ష్పగీజా క్రికెట్ లీగ్‌లో ఆడిన వారే ఉండడం విశేషం. ఆగస్టు 29 నుండి సెప్టెంబర్ 7 వరకు జరిగే టీ20 ట్రై-సిరీస్‌లో ఆఫ్ఘనిస్తాన్, యూఏఈ, పాకిస్తాన్‌లతో ఆడనుంది. ఈ మూడు జట్లు ఆసియా కప్ లో కూడా ఆడుతుండడం వీరికి ప్రాక్టీస్ గా ఉపయోగపడనుంది. ఆసియా కప్ లో ఆఫ్ఘనిస్తాన్ గ్రూప్ బి లో ఉంది. బంగ్లాదేశ్, శ్రీలంక, యూఏఈ జట్లు కూడా ఇదే గ్రూప్ లో ఉన్నాయి. 

ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్ తమ తొలి మ్యాచ్‌ను సెప్టెంబర్ 9న హాంకాంగ్‌తో ఆడనుంది. సెప్టెంబర్ 16, 18 తేదీల్లో వరుసగా బంగ్లాదేశ్..  శ్రీలంకతో తలపడనుంది. ఈ టోర్నీ లీగ్ మ్యాచ్ లన్నీ  అబుదాబిలో జరగనున్నాయి.

ఆసియా కప్ కు 22 మంది ఆఫ్ఘనిస్తాన్ ప్రిలిమినరీ స్క్వాడ్:
 
రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్ కీపర్), సెడిఖుల్లా అటల్, వఫివుల్లా తారఖిల్, ఇబ్రహీం జద్రాన్, దర్విష్ రసూలీ, మహ్మద్ ఇషాక్, రషీద్ ఖాన్ (కెప్టెన్), మహ్మద్ నబీ, షర్మాత్ నబీ, షర్మాత్ నబీ, నంగ్యాల్ ఖుద్రోతి ఒమర్జాయ్, గుల్బాదిన్ నైబ్, ముజీబ్ జద్రాన్, అల్లా గజన్‌ఫర్, నూర్ అహ్మద్, ఫజల్ హక్ ఫరూఖీ, నవీన్ ఉల్ హక్, ఫరీద్ మాలిక్, సలీమ్ సఫీ, అబ్దుల్లా అహ్మద్‌జాయ్, బషీర్ అహ్మద్

ఆసియా కప్ 2025లో ఆఫ్ఘనిస్తాన్ షెడ్యూల్

సెప్టెంబరు 9 - అబుదాబిలో ఆఫ్ఘనిస్తాన్ vs హాంకాంగ్ (7:30 PM IST)

సెప్టెంబరు 16 - అబుదాబిలో బంగ్లాదేశ్ vs ఆఫ్ఘనిస్తాన్ (7:30 PM IST)

సెప్టెంబరు 18 - అబుదాబిలో శ్రీలంక vs ఆఫ్ఘనిస్తాన్ (7:30 PM IST)