ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో ఊహించని విషాధం : 600 మంది నిద్రలోనే చనిపోయారు..!

ఆఫ్ఘనిస్తాన్ భూకంపంలో ఊహించని విషాధం : 600 మంది నిద్రలోనే చనిపోయారు..!

 నిన్న ఆదివారం రాత్రి ఆఫ్ఘనిస్తాన్‌లోని ఈశాన్య కునార్ ప్రావిన్స్‌లో 6.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ భారీ భూకంపంలో దాదాపు 600 మంది మరణించగా, సుమారు 800 మంది గాయపడ్డారు. అంతేకాదు పాకిస్తాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ (NCS) ప్రకారం ఈ భూకంపం అర్ధరాత్రి 00:47:41 ISTకి సంభవించింది. 

నంగర్‌హార్‌లో కనీసం తొమ్మిది మంది చనిపోగా,  చనిపోయినవారి సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.  ఇప్పటికే స్థానిక అధికారులు సహాయక చర్యలు మొదలుపెట్టారు. గాయపడినవారిని ఆసుపత్రులకు తరలించారు. ఈ భూకంపం దాదాపు 8-10 కిలోమీటర్ల లోతులో వచ్చింది. పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తున్ఖ్వాకు దగ్గరగా ఉన్న ఈ ప్రాంతంలో చాలా ఇళ్ళు దెబ్బతిన్నాయి.

నేషనల్ సెంటర్ ఫర్ సిస్మోలజీ (NCS) ప్రకారం ఈ భూకంపం తర్వాత నాలుగు, ఐదుసార్లు  ప్రకంపనలు వచ్చాయి. భూమి లోపల తక్కువ లోతులో వచ్చే భూకంపాలు చాలా ప్రమాదకరమైనవి, ఎందుకంటే భూకంప తరంగాలు ఉపరితలానికి తక్కువ దూరంలోనే ఉంటాయి. దీనివల్ల భూమి ఎక్కువగా కంపిస్తుంది, భవనాలకు ఎక్కువ నష్టం జరుగుతుంది, ప్రాణనష్టం కూడా ఎక్కువగా ఉంటుంది.

 

రెడ్ క్రాస్ ప్రకారం, ఆఫ్ఘనిస్తాన్‌లో సాధారణంగా  భూకంపాలు వస్తుంటాయి. హిందూ కుష్ పర్వత ప్రాంతం కాబట్టి ఇక్కడ ప్రతి సంవత్సరం భూకంపాలు సంభవిస్తాయి.