ఇండియాలో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ

ఇండియాలో ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ

గౌహ‌తి:ప‌ందుల్లో అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన అంటువ్యాధుల్లో ఒక‌టైన ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ ఉనికి ఇండియాలో బ‌య‌ట‌ప‌డింది. అస్సాంలో ఈ వ్యాధి బారిన‌ప‌డి 7 జిల్లాల్లోని 306 గ్రామాల్లో దాదాపు 2,500 పందులు చ‌నిపోయాయ‌ని తెలిపారు అధికారులు. భోపాల్ ‌లో మొదటి ఆఫ్రికన్‌ స్వైన్‌ ఫ్లూ (ఏఎస్‌ఎఫ్‌) నమోదైనట్లు నేషనల్‌ ఇన్ ‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హై సెక్యూరిటీ యానిమల్‌ డిసీసెస్‌ (ఎన్‌ఐహెచ్‌ఎస్‌ఏడీ) నిర్ధారించింది.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన అస్సాం ప్ర‌భుత్వం వ్యాధి బారిన ప‌డిన పందుల‌ను చంపేయాల‌ని నిర్ణ‌యించింది. అయితే ఆఫ్రిక‌న్ స్వైన్ ఫ్లూ మ‌నుషుల‌పై ప్ర‌భావం చూప‌ద‌ని.. వ్యాధి ఉనికి లేని ప్రాంతాల్లో పంది మాంసం తినేవారు తినొచ్చ‌ని అస్సాం స‌ర్కార్ క్లారిటీ ఇచ్చింద‌ని తెలిపారు అధికారులు. అటు 2019 గణాంకాల ప్రకారం రాష్ట్రంలో పందుల జనాభా 21 లక్షలు ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య సుమారు 30 లక్షలకు చేరిందన్నారు.