యూరియా కొరతకు చెక్.. 46 రోజుల తరువాత.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం

యూరియా కొరతకు చెక్.. 46 రోజుల తరువాత.. రామగుండం ఎరువుల ఫ్యాక్టరీలో ఉత్పత్తి ప్రారంభం

రైతులు విత్తనాలు వేసే సమయం, పంటకు ఎరువులు అవసరమైన కీలక సమయంలో నిలిచిపోయిన రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ.. మళ్లీ పున:ప్రారంభం అయ్యింది. 46 రోజుల విరామం తరువాత ఎట్టకేలకు  ఉత్పత్తి దశలోకి వచ్చింది ప్లాంట్. దీంతో రైతులకు ఎరువుల కష్టాలు తీరనున్నట్లు అధికారులు తెలిపారు. 

పెద్దపల్లి జిల్లా రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ (ఆర్ఎఫ్సీఎల్) లో యూరియా ఉత్పత్తి ప్రారంభించారు. ఆర్ఎఫ్ సీఎల్ లో కీలకమైన హెచ్టిఆర్ ఫెయిల్ అవడంతో గ్యాస్ ఒత్తిడిలో హెచ్చు తగ్గులు వచ్చి అమ్మోనియా పైప్ లైన్ లీక్ కావడంతో ఆగస్టు 14న ఉత్పత్తి నిలిపివేశారు.

దీంతో సుమారు 177 లక్షల టన్నుల ఉత్పత్తి నిలిచిపోయింది. అదే విధంగా 120 కోట్ల రూపాయల వరకు ఆర్థిక నష్టం ఏర్పడినట్లు అధికారులు అంచనా వేశారు. కీలకమైన సమయంలో ప్లాంట్ ఉత్పత్తి నిలిచిపోవడంతో తెలంగాణలో తీవ్ర యూరియా కొరత ఏర్పడింది.