
న్యూఢిల్లీ: డ్రీమ్11 పేరెంట్ కంపెనీ డ్రీమ్ స్పోర్ట్స్, ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలోకి అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. "డ్రీమ్ మనీ" అనే కొత్త యాప్‌ను టెస్ట్ చేస్తోంది. రియల్ మనీ గేమ్స్‌ను కేంద్రం బ్యాన్ చేయడంతో కొత్త సెక్టార్‌లోకి ఎంట్రీ ఇవ్వాలని చూస్తోంది. గూగుల్ ప్లే స్టోర్‌లోని వివరాల ప్రకారం, డ్రీమ్ మనీ యాప్ ద్వారా గోల్డ్ కొనుగోలు చేయడానికి వీలుంటుంది.
వినియోగదారులు రోజుకు రూ.10 నుంచి ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాగే రూ. వెయ్యి నుంచి ఫిక్స్‌డ్ డిపాజిట్‌లు పెట్టొచ్చు. ఈ యాప్‌ను డ్రీమ్ స్పోర్ట్స్ అనుబంధ సంస్థ డ్రీమ్‌సూట్ ద్వారా విడుదల చేశారు. డ్రీమ్‌సూట్ ఫైనాన్స్ అనే కొత్త సేవను త్వరలో ప్రారంభించనుంది. ప్రస్తుతం డ్రీమ్ సెట్‌గో (స్పోర్ట్స్ ట్రావెల్), ఫ్యాన్‌కోడ్ (టికెటింగ్, మర్చండైజ్), డ్రీమ్‌గేమ్ స్టూడియోస్ (గేమ్ డెవలప్‌మెంట్), డ్రీమ్‌స్పోర్ట్ ఫౌండేషన్ (నాన్-ప్రాఫిట్) వంటి ఇతర ప్లాట్‌ఫామ్‌లను డ్రీమ్‌స్పోర్ట్స్ కొనసాగిస్తోంది.