సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటాం

సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొంటాం

ఇటీవల జరిగిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది కాంగ్రెస్ పార్టీ. కనీసం పోటీ కూడా ఇవ్వలేకచతికిలపడింది. పరిస్థితి ఇలాగే కొనసాగితే కష్టమవుతుందనే భావనలో ఉన్న అధిష్టానం దిద్దుబాటు చర్యటు చేపట్టింది.పార్టీ పునర్నిర్మాణంపై ప్రధానంగా దృష్టి సారించింది. ప్రజా ఉద్యమాలు చేపట్టి పార్టీ బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ పెట్టాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించింది. సీడబ్య్లూసీ మీటింగ్ లో కాంగ్రెస్ ఓటమికి గల కారణాలను లోతుగా విశ్లేషించారు. వ్యూహాలు పక్కాగా అమలు చేయకపోవడంతోనే ఓడిపోయామని అంగీకరించారు కాంగ్రెస్ పెద్దలు. దీన్ని సవాల్ గా తీసుకుని ఈ ఏడాది, 2022 లో జరిగే ఎన్నికలు, 2024 లోక్ సభ ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేశారు.పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసుకోవాలని నిర్ణయించింది.  రాబోయే ఎన్నికల్లో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ఇన్ ఛార్జ్ కేసీ వేణుగోపాల్ తెలిపారు.ప్రధానంగా సంస్థాగత బలహీనతలు అధిగమించి, పార్టీలో సమగ్రమైన మార్పులు తీసుకురావాలని హస్తం పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరించినట్లు తెలిపారు.

మరిన్ని వార్తల కోసం