కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలి

కనీస మద్దతు ధరపై చట్టం తీసుకురావాలి

ఘాజీపూర్: కనీస మద్దతు ధర (ఎంఎస్‌‌పీ)పై చట్టం తీసుకురావాలని భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) నేత రాకేశ్ తికాయత్ డిమాండ్ చేశారు. ఎంఎస్‌‌పీ ఇప్పుడు అమలు అవుతోందని, ఇక పైనా కొనసాగుతుందని రాజ్యసభలో ప్రధాని మోడీ స్పష్టం చేసిన నేపథ్యంలో తికాయత్ కామెంట్స్ ఆసక్తిని రేకెత్తించాయి. ఎంఎస్‌‌పీకి గ్యారెంటీ కల్పిస్తూ ఓ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని తికాయత్ అన్నారు.

‘ఎంఎస్‌‌పీ కథ ముగిసిందని మేం చెప్పామా? ఎంఎస్‌‌పీకి చట్టబద్ధత కల్పిస్తే దేశంలోని రైతులందరికీ ప్రయోజనం కలుగుతుంది. కనీస మద్దతు ధర అమలుకు సంబంధించి దేశాంలో ప్రస్తుతం ఎలాంటి చట్టాలూ లేవు. అందుకే ట్రేడర్లు అన్నదాతలను దోచుకుంటున్నారు’ అని తికాయత్ పేర్కొన్నారు. సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని లేకపోతే అక్టోబర్ 2వ తేదీ వరకు తమ ఆందోళనలను ఆపబోమని ఆయన మరోసారి స్పష్టం చేశారు.