కరోనా తర్వాత కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్ కు బూస్టప్

కరోనా తర్వాత కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్ కు బూస్టప్

వెలుగు, బిజినెస్ డెస్క్కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్.. ఎకానమీకి ఎంతో కీలకం. దేశ జీడీపీ గ్రోత్‌‌ను, మార్కెట్‌‌లో పోటీని పెంచడమే కాకుండా.. ఉద్యోగాల క్రియేషన్‌‌లోనూ ఇది ముందంజలో ఉంటోంది. కోట్ల మంది వర్కర్లు కన్‌‌స్ట్రక్షన్‌‌లోనే పనిచేస్తూ ఉంటారు. అందుకే ఏదైనా సంక్షోభం వచ్చినప్పుడు ఎకానమీని తిరిగి పట్టాలెక్కించడంలో కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్‌‌‌‌ ముఖ్య పాత్ర పోషిస్తుంది. కరోనా తర్వాత కూడా కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్‌‌‌‌కు బూస్టప్‌‌ ఉంటుందని ఈ ఇన్‌‌సైట్ కో ఫౌండర్ సీఈవో అనిరుధ్ రెడ్డి అభిప్రాయపడుతున్నారు. ఈఇన్‌‌సైట్ అనేది ఒక ప్లగ్‌‌ అండ్ ప్లే హార్డ్‌‌వేర్, సాఫ్ట్‌‌వేర్ ప్రొడక్ట్. ఇది కన్‌‌స్ట్రక్షన్‌‌ సెక్టార్‌‌‌‌లోని ప్రాజెక్ట్‌‌లను కంపెనీలు రిమోట్‌‌గా మానిటర్ చేసేందుకు, మరింత సమర్థవంతంగా పనిచేసేందుకు ఉపయోగపడుతోంది. కరోనా తర్వాత కన్‌‌స్ట్రక్షన్, ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌కు ఎలా డిమాండ్ ఉండబోతోంది? ఈ రంగంలో టెక్నాలజీ ఎలాంటి పాత్ర పోషించబోతోంది? వంటి విషయాలను అనిరుధ్ వివరించారు.

కరోనా లాక్‌‌డౌన్‌‌ టైంలో ఈఇన్‌‌సైట్ ఎలా పనిచేస్తోంది..?

ఈఇన్‌‌సైట్ ముఖ్యంగా సాఫ్ట్‌‌వేర్ టెక్నాలజీ కంపెనీ. మా టీమ్‌‌లో మెజార్టీ మెంబర్లు పనిచేస్తూనే ఉన్నారు. కొంత మంది మా సాఫ్ట్‌‌వేర్ ఇంజనీర్లు ఇంటి నుంచి వర్క్ చేస్తూనే మంచి అవుట్‌‌పుట్‌‌ను ఇస్తున్నారు. ఈ సమయంలో చాలా అవకాశాలున్నాయి. కరోనా టైమ్‌‌లో కంపెనీలకు సాయం చేసేందుకు మా టెక్నాలజీని ఎలా వాడాలి..? మా సాఫ్ట్‌‌వేర్‌‌‌‌ ప్రొడక్ట్‌‌లను కంపెనీలకు ఎలా అందివ్వాలి? అనే విషయాలపైనే మేము ఎప్పడికప్పుడు చర్చిస్తూ ఉంటున్నాం.

వచ్చే కొన్నేళ్లలో కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్ ఎలా ఉండబోతుంది…?

మేము హెవీ సివిల్ కన్‌‌స్ట్రక్షన్, మైనింగ్‌‌పై ఎక్కువగా ఫోకస్ చేశాం. ఇవి రెండు అత్యంత వేగంగా ఎదుగుతున్న రంగాలు. ఏదైనా సంక్షోభం నుంచి ఫస్ట్ బయట పడేది ఈ రెండే.  ప్రభుత్వాలు కొత్త ఇన్‌‌ఫ్రాస్ట్రక్చర్‌‌‌‌ను అభివృద్ధి చేయడంపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటాయి.   ప్రభుత్వ ఫండింగ్‌‌తో.. మరిన్ని ఉద్యోగాలను క్రియేట్ చేస్తూ..  దేశంలో ప్రొడక్షన్ చేపట్టే ఒకే ఒక్క ఇండస్ట్రీ ఇది. వచ్చే కొన్ని నెలల్లో కన్‌‌స్ట్రక్షన్ రంగంలో పనులన్నీ తిరిగి ప్రారంభమవుతాయి. వచ్చే కొన్నేళ్లలో కన్‌‌స్ట్రక్షన్ సెక్టార్ చాలా బాగుంటుంది. ఈ ఇండస్ట్రీ కోసం మేము రకరకాల టెక్నాలజీలను తీసుకొచ్చాం. హెవీ మెషిన్లలో టెలిమాటిక్ సెన్సర్లను వాడుతున్నాం. ఏఐ, కంప్యూటర్ విజన్ ఆల్గారిథమ్‌‌లను వాడుతూ సైట్‌‌లో ఏం జరుగుతోందో ఆటోమేటిక్‌‌గా ట్రాక్‌‌ చేస్తుంటాం. కరోనా టైమ్‌‌లో ఫిజికల్ కాంటాక్ట్‌‌ ఉండొద్దు కాబట్టి వచ్చే ఆరు నెలల్లో మా టెక్నాలజీ యాప్స్‌‌కు మరింత డిమాండ్ పెరుగుతుంది. ఉదాహరణకు ఫ్యూయల్ వినియోగం చెక్ చేసేలా ఫ్యూయల్ ఆగర్ అనే యాప్ రూపొందించాం. ఎన్ని టన్నుల మెటీరియల్స్‌‌ను తరలించారు? ప్రొడక్షన్ ఎంతైంది..? అన్నింటినీ కూడా మేనేజర్లు ఫిజికల్‌‌గా సైట్‌‌కు వెళ్లకుండానే తెలుసుకోవచ్చు. ఎప్పడికప్పుడు డేటాను ట్రాక్ చేస్తూ.. ప్రొడక్షన్ పెరిగేలా కంపెనీలకు మా టెక్నాలజీ ఉపయోగపడనుంది. కంపెనీల నుంచి కూడా మాకు డిమాండ్ ఉంటుంది. ఈ మధ్యనే కంప్యూటర్ విజన్ సిస్టమ్‌‌లో ఏఐ కేపబిలిటీతో సోషల్ డిస్టెన్సింగ్‌‌ను కూడా ట్రాక్  చేయడం ప్రారంభించాం. సైట్‌‌లో మాస్క్‌‌లను ధరిస్తున్నారా? లేదా అనేది ఇది ట్రాక్ చేస్తుంది. ఉద్యోగుల హెల్త్, సేఫ్టీ కూడా మాకు చాలా ముఖ్యం.  ఈ ట్రాకింగ్‌‌లో ఉద్యోగులు 6 అడుగుల దూరం మెయింటైన్ చేయడం లేదని తెలిస్తే.. అలారమ్ మోగుతుంది. కంపెనీలు మళ్లీ తిరిగి ఆపరేషన్స్ ప్రారంభించడానికి ఇది చాలా ఉపయోగపడుతుంది. వర్కర్ల సేఫ్టీతో పాటు కెపాసిటీని చేరుకోవడానికి సాయపడుతుంది.

కన్‌‌స్ట్రక్షన్‌‌లో ఉన్న అవకాశాలేమిటి..?

ఈ ప్రభావం స్వల్ప కాలంగానే ఉంటుంది. అది కూడా మూవ్‌‌మెంట్, ట్రావెల్‌‌పై ఆంక్షలు ఉండటం వల్లనే ఈ పరిస్థితి. ఈ ఇండస్ట్రీపై మేము ఆశాభావంతోనే ఉన్నాం. ఇండస్ట్రీ దీనికి ఇదే మళ్లీ పుంజుకుంటుంది. గ్రోత్‌‌ను, ఉద్యోగావకాశాలను క్రియేట్ చేసేందుకు ప్రభుత్వాలు చూస్తున్నాయి. ప్రజలు అంతకుముందు ఎప్పుడూ చేయని విధంగా ఇప్పుడు పనిచేస్తున్నారు. వీడియోకాన్ఫరెన్స్‌‌ల ద్వారానే మీటింగ్స్ పెట్టుకుంటూ ప్రొడక్టివిటీ పెంచుకోవడంపై దృష్టిసారిస్తున్నారు.

పేసర్లను  కాదు ఫస్ట్ బాల్ నే ఫేస్ చేయలేను