వైరల్ వీడియో: పెళ్లి మండపంలో వధూవరుల గొడవ

వైరల్ వీడియో: పెళ్లి మండపంలో వధూవరుల గొడవ

పెళ్లి మండపంలో వధూవరులు గొడవ పడిన వీడియో వైరల్ గా మారింది. దీనిపై నెటిజన్ల నుంచి వివిధ రకాల కామెంట్లు వస్తున్నాయి. పలు ప్రాంతాల్లో వింత వివాహ ఆచారాలు ఉన్నాయి. నేపాల్ లో కూడా అలాంటి ఆచారం ఉంది. పెళ్లి తర్వాత దంపతులు ఒకరికొకరు ఫుడ్ తినిపించుకునే ఆచారం ఉంది. దీంతో ఈ ఆచారం స్టార్ట్ అయిన వెంటనే వధూ వరులు ఫుడ్ తినిపించేందుకు పోటీ పడ్డారు. ఒకరిని ఒకరు నెట్టుకున్నారు.

వధువు బలవంతంగా ఫుడ్ తినిపిస్తూంటే వరుడు నవ్వుతూ కనిపించాడు. మరోవైపు నవ దంపతులు గొడవపడకుండా బంధువులు ప్రయత్నిస్తున్న ఈ వీడియోను ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేశారు. దీనికి 70 వేలకు పైగా లైకులు వచ్చాయి. ఈ పోటీని దంపతులు చాలా సీరియస్ గా తీసుకున్నారని కామెంట్లు చేస్తున్నారు నెటిజన్లు.