హైదరాబాద్,వెలుగు: రెండేళ్ల తర్వాత సొంతగడ్డపై ఆడిన మ్యాచ్‌లో హైదరాబాద్ ఎఫ్‌సీ సత్తా చాటింది. ఇండియన్ సూపర్ లీగ్ (ఐఎస్‌ఎల్) తొమ్మిదో సీజన్‌లో భాగంగా గచ్చిబౌలి స్టేడియంలో శనివారం జరిగిన మ్యాచ్‌లో హైదరాబాద్ 1–0తో బెంగళూరు ఎఫ్‌సీని ఓడించి లీగ్‌లో రెండో విజయం ఖాతాలో వేసుకుంది. 83వ నిమిషంలో స్టార్ ప్లేయర్ ఒగ్బాచే ఏకైక గోల్‌తో ఆతిథ్య జట్టు గెలిచింది.
ఆలిండియా ఫుట్‌బాల్ ఫెడరేషన్ కొత్త ప్రెసిడెంట్‌గా కళ్యాణ్ చౌబే.. హైదరాబాద్ ఎఫ్‌సీ ఓనర్స్ వరుణ్, విజయ్, శాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, తెలంగాణ ఫుట్‌బాల్ సంఘం ప్రతినిధులతో కలిసి ఈ మ్యాచ్ వీక్షించారు.
