ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన రవితేజ

ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పిన  రవితేజ

‘విక్రమార్కుడు’లో విక్రమ్ రాథోడ్ పాత్ర తర్వాత తనకు మళ్ళీ అంతటి సంతృప్తిని ఇచ్చిన పాత్ర ‘టైగర్ నాగేశ్వరరావు అన్నారు రవితేజ. ఆదివారం నిర్వహించిన సక్సెస్‌‌మీట్‌‌లో ఈ సినిమాను గొప్పగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ఆయన థ్యాంక్స్ చెప్పారు. ‘ప్రేక్షకుల నుంచి గొప్ప స్పందన వస్తోంది. ప్రతి సీన్‌‌ను, డైలాగ్‌‌ని ప్రేక్షకులు గొప్పగా ఎంజాయ్ చేస్తున్నారు. 

రవితేజ గారి నటన, ఎమోషన్స్, యాక్షన్ ప్రేక్షకులని అలరిస్తోంది. కలెక్షన్స్, షోస్, రోజురోజుకి పెరుగుతున్నాయి’ అని దర్శకనిర్మాతలు తెలిపారు. ప్రవీణ్, కిషోర్ కుమార్, జ్వాలా కోటి, వినోద్ వర్మ, శ్రీకాంత్ విస్సా, నిర్మాతలు వివేక్ కూచిభొట్ల, మయాంక్ సింఘానియా తదితరులు పాల్గొన్నారు.