అగ్నిపథ్ పథకంపై రాజ్నాథ్ నివాసంలో కీలక భేటీ

అగ్నిపథ్ పథకంపై రాజ్నాథ్ నివాసంలో కీలక భేటీ

అగ్నిపథ్ స్కీంపై రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ నివాసంలో కీలక భేటీ జరుగుతోంది. కొత్త రిక్రూట్ మెంట్  స్కీంపై ఇప్పటికే పలు దఫాలుగా రక్షణమంత్రి చర్చలు జరిపారు. నిన్నటికి నిన్న ఆర్మీ, ఎయిర్ ఫోర్స్, నేవీ చీఫ్ లతో భేటీ అయిన రాజ్ నాథ్ ఇవాళ మరోసారి సమావేశమయ్యారు. అగ్నిపథ్ స్కీంపై నిరసనలు చల్లార్చేందుకు ఇప్పటికే కేంద్ర హోం శాఖ .. ఫస్ట్ బ్యాచ్ కు చాలా సడలింపులు ప్రకటించింది. ఏజ్ రిలాక్సేషన్ ఇచ్చింది. మధ్యాహ్నం త్రివిధ దళాధిపతులు ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ స్కీంపై వస్తున్న అన్ని అనుమానాలను క్లియర్ చేసే ఛాన్స్ ఉంది. ఆందోళనల్లో పాల్గొనవద్దని, హింసాత్మక ఘటనల్లో పాల్గొంటే పోలీస్ క్లియరెన్స్ రాదని నిన్నటికి నిన్న ఎయిర్ ఫోర్స్ చీఫ్ చౌదరి అలర్ట్ చేశారు.