రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్

 రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్

జమ్మికుంట, వెలుగు: రైతుల సమస్యల పరిష్కారం కోసమే అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రారంభిస్తున్నట్లు కరీంనగర్ జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి ప్రతిమ చెప్పారు. బుధవారం జిల్లాలోని ఇల్లందకుంట మండల కేంద్రంలోని రైతు వేదికలో అగ్రి లీగల్ రూమ్ ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ధరణి  పోర్టల్ ద్వారా ఏర్పడిన సమస్యలను చట్టప్రకారం ఎలా చేయాలో రైతులకు అవగాహన కల్పిస్తామన్నారు. పహాణీలో సమస్యలు, రుణాల వాయిదాల చెల్లింపులు, తదితర సమస్యలపై కోర్టుల చుట్టు తిరుగుతూ ఇబ్బందులు పడే వారి కోసం మండలంలో అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్ పనిచేస్తుందన్నారు. కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి వాసిరెడ్డి శ్రీధర్, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కె.భగవాన్ రెడ్డి. సర్పంచ్​ శ్రీలత సురేందర్ రెడ్డి, వ్యవసాయ సంచాలకురాలు జి.సునీత, మండల వ్యవసాయ అధికారి గుర్రం రజిత తదితరులు పాల్గొన్నారు.