ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఆందోళన : బి.ప్రసాద్

ఉపాధి హామీ చట్టం రక్షణ కోసం ఆందోళన : బి.ప్రసాద్

నిజామాబాద్ సిటీ, వెలుగు: గ్రామీణ ఉపాధి హామీ చట్ట రక్షణ కోసం ఈ నెల 11న దేశవ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నట్లు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు బి.ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం నిజామాబాద్​లో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సమావేశం  జరిగింది. ఈ సందర్భంగా ప్రసాద్​మాట్లాడుతూ.. మోదీ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామీణ ఉపాధి పనిని తొలిగించిందేందుకు ప్రయత్నించిందన్నారు.

జాబ్ కార్డు కలిగిన పేదలందరికీ ప్రభుత్వమే పని చూపించాలనే బాధ్యత నుంచి తప్పుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు యత్నిస్తున్నాయన్నారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్ద వెంకట రాములు, జిల్లా ఉపాధ్యక్షురాలు నర్రా శంకర్ తదితరులు పాల్గొన్నారు.