
సూర్యాపేట, వెలుగు : రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చిన ఘనత కాంగ్రెస్‌దేనని వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వేణారెడ్డి అన్నారు. సోమవారం సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ యార్డులో జిల్లా వ్యవసాయశాఖ అధికారులతో కలిసి జాతీయ ఆహార భద్రత మిషన్ 2025– 26 చిరు సంచుల విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా వేణారెడ్డి మాట్లాడుతూ రైతుల భవిష్యత్‌ను మెరుగుపర్చడానికి ప్రభుత్వం విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా రైతుల పంట దిగుబడి పెంచే దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందన్నారు. ఈ కిట్లలో ప్రధానంగా వరి, కంది, పెసర, మినుము, జొన్న వంటి పంటల విత్తనాలు ఉన్నాయని తెలిపారు.