దివాళీ స్పెషల్ : 27 రూపాయలకే కిలో గోధుమ పిండి : మీ గల్లీల్లోకి వచ్చి బండ్లపై అమ్ముతారు

దివాళీ స్పెషల్ : 27 రూపాయలకే కిలో గోధుమ పిండి : మీ గల్లీల్లోకి వచ్చి బండ్లపై అమ్ముతారు

గోధుమ పిండి అనగానే మనకు ప్యాకెట్లే గుర్తుకొస్తాయి.. ప్రస్తుతం హైదరాబాద్ రిటైల్ మార్కెట్ లో కిలో గోధుమ పిండి 50 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది. ఇందులో వెరైటీలను చూస్తే కిలో 250 రూపాయలు కూడా ఉంది. ఈ ధరలను చూసిన కేంద్ర ప్రభుత్వం.. కొత్తగా ఓ స్కీం తీసుకొచ్చింది. భారత్ ఆటా పేరుతో దేశవ్యాప్తంగా ప్రత్యేక వాహనాల్లో తిరుగుతూ అమ్మటం అన్నమాట.. ఈ భారత్ ఆటా.. కిలో 27 రూపాయలకే ఇస్తున్నారు. కొత్త పథకానికి శ్రీకారం చుట్టిన కేంద్రం.. దేశవ్యాప్తంగా 2 వేల కేంద్రాలు.. 800 వాహనాల ద్వారా అమ్మకానికి నిర్ణయించింది.

దీపావళి పండుగ సంద్భంగా కేంద్ర ప్రభుత్వం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది. భారత్ ఆటా పేరుతో దేశ వ్యాప్తంగా ప్రజలకు ఊరట కలిగించేందుకు సబ్సిడీపై గోధుమ పిండిని అందించే కార్యక్రమాన్ని సోమవారం (నవంబర్ 6) ప్రారంభించింది. NAFED, NCCF, కేంద్రీయ భండార్ సహకారంతో 800 మొబైల్ వ్యాన్ల ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న 2వేల అవుట్ లెట్ ల ద్వారా భారత్ ఆటా పేరుతో గోధుమ పిండిని విక్రయిస్తోంది కేంద్ర ప్రభుత్వం. 

ప్రస్తుతం మార్కెట్లో కిలో గోధుమ పిండి నాణ్యత, ప్రాంతాన్ని బట్టి రూ. 36 నుంచి 70 లకు విక్రయించబడుతోంది.. దీనికి కంటే తక్కువ రేటుకు భారత ప్రభుత్వం గోధుమ పిండిని అందిస్తోంది. 2023 ఫిబ్రవరిలో ధరల స్థీరీకరణ నిధిలో పథకంలో భాగంగా  NAFED, NCCF, కేంద్రీయ భండార్  సహకార సంఘాల ద్వారా 18 వేల టన్నుల భారత్ ఆటా ను కిలో కు రూ. 29.50 చొప్పున భారత ప్రభుత్వం ప్రయోగాత్మకంగా విక్రయించింది. 

సోమవారం నుంచి కిలో గోధుమ పిండి రూ. 27.50 లకు దేశవ్యాప్తంగా NAFED, NCCF, కేంద్రీయ భండార్  ఏజెన్సీల ద్వారా 800 మొబైల్ వ్యాన్లతో 2వేల అవుట్ లెట్ ల ద్వారా అందిస్తున్నట్లు మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు.