'అహింస'.. ప్రీ రిలీజ్‌..తాత కోరికను నెరవేర్చా

'అహింస'.. ప్రీ రిలీజ్‌..తాత కోరికను నెరవేర్చా

దగ్గుబాటి రానా తమ్ముడు దగ్గుబాటి అభిరామ్ ఎంట్రీ ఇస్తున్నా చిత్రం  ‘అహింస’.  తేజ దర్శకత్వం వహించిన ఈ సినిమాను .. ఆనంది ఆర్ట్‌ క్రియేషన్స్‌ పతాకంపై పి.కిరణ్‌ నిర్మించారు. ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అభిరామ్‌కు జోడీగా గీతి​కా తివారీ హీరోయిన్‌గా నటిస్తుంది. ఈ సినిమా జూన్‌ 2న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో  సినిమా ప్రీ రిలీజ్‌  కార్యక్రమం ఆంధ్రప్రదేశ్‌  చీరాల బాయ్స్ హైస్కూల్ గ్రామంలో ఘనంగా జరిగింది.  ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా దగ్గుబాటి రానా హాజరయ్యారు. 

అహింస ఈ సినిమా షూట్‌ లో దర్శకుడు తేజ  తనని అందరి ముందు  కొట్టారని  అభిరామ్‌ చెప్పారు. ఓ సీక్వెన్స్‌ షూట్‌ చేస్తున్నప్పుడు ప్రమాదవశాత్తు తనకు దెబ్బలు తగిలాయని, ఆరు నెలలపాటు బెడ్‌ రెస్ట్‌ తీసుకున్నానని తెలిపాడు. తన తాత రామానాయడు కోరిక తనను హీరోగా చూడాలని..కానీ దురదృష్టవశాత్తు ఆయన మన మధ్య లేరని బాధపడ్డాడు. తనను నమ్మి సినిమా తీసిన డైరెక్టర్ తేజకు ధన్యవాదాలు తెలిపాడు. 

తేజ నచ్చిన వ్యక్తితోనే సినిమా చేస్తారని దగ్గుబాటి రానా అన్నారు. తేజ గురించి గతంలో చాలా మంది అనేక రకాలుగా చెప్పారు. కానీ నేను నమ్మలేదన్నారు. నన్ను డైరెక్టర్ తేజ ఒక నటుడిగా మార్చారని తెలిపారు. బాబాయ్ వెంకటేష్, తనకు ఇచ్చిన ప్రేమ, సపోర్టు్ను తమ్ముడు అభిరామ్ కు ఇవ్వాని కోరారు.