ఐపీఎల్ లో కొత్త జట్లను ప్రకటించిన బీసీసీఐ

V6 Velugu Posted on Oct 25, 2021

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL)లో రెండు కొత్త జట్లు ఎంటరయ్యాయి. వచ్చే సీజన్ లో కొత్తగా అహ్మదాబాద్, లక్నో టీంలు కూడా పాల్గొంటాయని బీసీసీఐ తెలిపింది. రెండు కొత్త జట్ల కోసం ఇటీవల నిర్వహించిన బిడ్డింగ్ లో... అహ్మదాబాద్ జట్టును సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సంస్థ సొంతం చేసుకుంది. లక్నో జట్టును ఆర్పీజీ గ్రూప్  దక్కించుకుంది.

లక్నో ఫ్రాంచైజీ కోసం RPG గ్రూప్ అధినేత సంజీవ్ గోయెంకా రూ.7 వేల కోట్లకు బిడ్ వేశారు.  అహ్మదాబాద్ జట్టు కోసం CVC క్యాపిటల్ సంస్థ రూ.5 వేల కోట్లకు బిడ్ దాఖలు చేసింది. ఈ రెండు కొత్త ఫ్రాంచైజీల చేరికతో IPL లో జట్ల సంఖ్య 10కి పెరిగింది. వచ్చే సీజన్ నుంచే ఈ రెండు జట్లు పాల్గొననున్నాయి.

Tagged Ahmedabad,  Lucknow,  new teams,  IPL

Latest Videos

Subscribe Now

More News