ఏఐ ఎఫెక్ట్.. ఇండియాలో 1.8 కోట్ల జాబ్స్ కు కోత

ఏఐ ఎఫెక్ట్.. ఇండియాలో 1.8 కోట్ల జాబ్స్ కు  కోత

న్యూఢిల్లీ: ఆర్టిఫిషియల్​ఇంటెలిజెన్స్​(ఏఐ) టెక్నాలజీల వల్ల మనదేశంలో 2030 నాటికి తయారీ, రిటైల్, విద్యా రంగాల్లో 1.8 కోట్ల ఉద్యోగులపై వేటు పడనుందని వెల్లడయింది. సర్వీస్​నౌ రిపోర్ట్, తయారీ రంగంలో 80 లక్షలు, రిటైల్లో 76 లక్షలు, విద్యారంగంలో 25 లక్షల ఉద్యోగాలు ప్రభావితం కానున్నాయి. అయితే, ఏఐ ద్వారా 30 లక్షల కొత్త సాంకేతిక ఉద్యోగాలు కూడా వస్తాయని తెలిపింది. 

ఏఐ వల్ల డేటా ఎంట్రీ, కస్టమర్​కేర్​వంటి పునరావృత పనులు చేసే ఉద్యోగాలు ఎక్కువగా ప్రభావితం అవుతాయి. డేటా భద్రత, భవిష్యత్ నైపుణ్యాల గురించి కంపెనీ ఆందోళన చెందుతున్నాయి. మనదేశం ఏఐకి -సిద్ధంగా ఉన్న ప్రతిభను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషించగలదని రిపోర్ట్​పేర్కొంది. ---ఏఐ  ఉద్యోగాలపై చూపే ప్రభావంపై అంతటా ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో, దేశంలోనే అతిపెద్ద ఐటీ సేవల సంస్థ  టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్  ఏఐ టెక్నాలజీలు సహా పలు కారణాల వల్ల తమ మొత్తం ఉద్యోగులలో రెండు, అంటే 12 వేల ఉద్యోగాలను తొలగించనున్నట్లు ప్రకటించింది.